Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:33AM

ముంబై VS లాహోర్‌

రాయ్‌పూర్‌: భారతగడ్డపై చాంపియన్స్‌లీగ్‌ టీ20 టోర్నీకి రంగం సిద్ధమైంది. శనివారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లకు తెరలేవనుంది. ముంబై ఇండియన్స్‌ (భారత్‌), లాహోర్‌ లయన్స్‌ (పాకిస్థాన్‌), నార్తర్న్‌ నైట్స్‌ (న్యూజిలాండ్‌), సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌ (శ్రీలంక) జట్లు అర్హత మ్యాచ్‌ల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ ఆరు మ్యాచ్‌లకు రాయపూర్‌లోని చత్తీస్‌గఢ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికకానుంది. ఆరంభ అర్హత మ్యాచ్‌ల్లో.. తొలుత నార్తర్న్‌ నైట్స్‌తో సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌ (సా.4 గంటలకు).. ఆనక లాహోర్‌ లయన్స్‌తో ముంబై (రా. 8గం) తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇక ఈ క్వాలిఫయింగ్‌ రౌండ్లో టాప్‌-2లో నిలిచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించాలని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై కృత నిశ్చయంతో ఉంది. అయితే ఈసారి కెప్టెన్‌ రోహిత్‌ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బ. ఈ టోర్నీలో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ పొలార్డ్‌ జట్టు కు సారథ్యం వహించనున్నాడు. రాయుడు, పొలార్డ్‌, కోరె అండర్సన్‌తో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. కాగా లాహోర్‌ లయన్స్‌కు మహ్మద్‌ హఫీజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ముంబైని ఎదుర్కోవడం లాహోర్‌కు కఠిన సవాలే. ఓపెనర్‌ షెహజాద్‌, కెప్టెన్‌ హఫీజ్‌, ఉమర్‌ అక్మల్‌, జంషెడ్‌ ప్రదర్శనపైనే లాహోర్‌ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరో మ్యాచ్‌లో నార్తర్న్‌ నైట్స్‌, సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌ పోటీపడనున్నాయి. జెహాన్‌ ముబారక్‌ నేతృత్వంలోని సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌ శుభారంభం చేయాలని భావిస్తోంది. కుశాల్‌ పెరీరా, మహరూఫ్‌, సచిత్‌, సండకెన్‌ వంటి ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది. ఇక నార్తర్న్‌ జట్టుకు డానియల్‌ ఫ్లిన్‌ సారథ్యం వహించనున్నాడు. టిమ్‌ సౌథీ, డానియల్‌ హారిస్‌, కేన్‌ విలియమ్సన్‌ పేరున్న ఆటగాళ్లు. అయితే ఈ జట్టు ఆటగాళ్లలో ఎక్కువమందికి ఉపఖండ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం ఈ జట్టు బలహీనత.
ఐపీఎల్‌ జట్లే ఫేవరెట్లు: చాంపియన్స్‌లీగ్‌ టీ20లో ఐపీఎల్‌ జట్లే ఫేవరెట్లు అని కేప్‌ కోబ్రాస్‌ కెప్టెన్‌ జస్టిన్‌ ఆంటాంగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘సీఎల్‌టీ20 టైటిల్‌ను ఐపీఎల్‌ జట్లలో ఒకటి నెగ్గుతుందని భావిస్తున్నా. అయితే ఇతర జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లున్నారు. వాటికీ ట్రోఫీ చాన్సుంద’ని ఆంటాంగ్‌ తెలిపాడు.
జట్లు (అంచనా):
ముంబై ఇండియన్స్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), హర్భజన్‌, రాయుడు, ఓఝా, ప్రవీణ్‌ కుమార్‌, ఆదిత్య తారె, బుమ్రా, మైకేల్‌ హస్సీ, కోరె అండర్సన్‌, మలింగ, డిలాంజ్‌/సిమన్స్‌.
లాహోర్‌ లయన్స్‌: మహ్మద్‌ హఫీజ్‌ (కెప్టెన్‌), షెహ్‌జాద్‌, సిద్దిఖి, ఉమర్‌ అక్మల్‌, నాసిర్‌ జంషెడ్‌, సల్మాన్‌ అలీ, అసిఫ్‌ రజ్‌, ముస్తఫా ఇక్బాల్‌, వాహబ్‌ రియాజ్‌, నసీమ్‌, రసూ ల్‌/సయీద్‌.

నార్తర్న్‌ నైట్స్‌ సదరన్‌ ఎక్స్‌ప్రెస్‌
సా. 4 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌ 1, 3లో
ముంబై లాహోర్‌ లయన్స్‌
రాత్రి 8 నుంచి