Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:32AM

ఎంసెట్‌ రెండవ విడత కౌన్సెలింగ్‌ రద్దుతో విద్యార్థులకు తీరని నష్టం:సీపీఐ రామకృష్ణ


అనంతపురం (ఓల్డ్‌టౌన్‌), సెప్టెంబర్‌ 12 : ఎంసెట్‌ రెండవ విడత కౌన్సెలింగ్‌ నిర్వహించరాదని కోర్టుతీర్పు ఇవ్వడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోతారని, ఇది దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. అనంతపురంలో శుక్రవారం రైతు శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఎంసెట్‌ కౌన్సెలింగ్‌పై నిర్లక్ష్యం వహించాయన్నారు. దీనివల్ల ఒక సంవత్సరం వృథా అవుతోందన్నారు. తక్షణమే రెండు రాష్ట్రాల రాజకీయ ప్రతినిధులు చర్చించి త్వరితగతిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ యథావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నేరవేర్చాలన్నారు. సెప్టెంబర్‌ 24న 10వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో పెద్ద సదస్సు నిర్వహించనున్నామన్నారు.