Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:31AM

ఆన్‌లైన్‌ పర్యవేక్షణ


 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై మంత్రులకు ప్రధాని సూచన
న్యూఢిల్లీ : దేశంలో ఇన్‌ఫ్రా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన ప్రాధాన్యత అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయా శాఖలను కోరారు. అలాగే ఎఫ్‌డిఐలు అను మతించేందుకు వీలుగా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని రైల్వే శాఖను ఆదేశించారు. ఇన్‌ఫ్రాలోని భిన్న విభాగాలకు చెందిన ప్రాజెక్టులు నిర్దేశిత కాలపరిమితి ప్రకారం పురోగమిస్తున్నది లేనిది నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరాన్నిప్రధాని గుర్తించారని, ఆయా శాఖల నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు జరుగుతున్నది లేనిది పరిశీలించాలని ఆదేశించారని శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వివిధ మంత్రిత్వ శాఖలు ఆయా ప్రాజెక్టుల పురోగతిని ఎలక్ర్టానిక్‌ రిపోర్టింగ్‌ ఫార్మాట్‌లోనే పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించినట్టు పేర్కొంది. పౌర విమానయాన శాఖ, పోర్టులు, అం తర్గత జలవనరులు, రైల్వే, రోడ్లు, టెలికాం, విద్యుత్‌, బొగ్గు, పునర్‌వినియోగ ఇంధన వనరుల శాఖల వ్యవహారాలు, ఆయా శాఖలు సాధించిన పురోగతిపై నెలవారీ సమీక్ష అనంతరం ప్రధాని ఈ ఆదేశాలు జారీ చేశారని ఆ వర్గా లు తెలిపాయి. దేశంలో అంతర్జాతీయ శ్రేణి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలన్నది ప్రధాని లక్ష్యమని వారన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి వివిధ రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న చర్యలను, ఇతర దేశాలతో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పం దాలను కూడా ఈ సందర్భంగా పరిశీనలోకి తీసుకోవాలని మోదీ సూచించారు. పోర్టుల అనుసంధాన అభివృద్ధి కోసం సాగర్‌మాత ప్రాజెక్టును చేపట్టాలని షిప్పింగ్‌ శాఖకు సూచించిన ప్రధాని తాను ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా కల నెరవేరడానికి ఇదే కీలకమని మోదీ అన్నారు.