Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:30AM

ముందువరసలో కడప జిల్లా

అపోహలు సృష్టించే వారికి కనువిప్పు చేస్తాం
శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డి

కడప, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): కడప జిలా ్లలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రాలేదని, అందుకే ప్ర భుత్వం అభివృద్ధి విషయం లో వివక్ష చూపుతున్నదని కొందరు కట్టుకథలు చెపుతూ అపోహలు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే కడపను అభివృద్ధిపరంగా ముందువరుసలో నిలిపి, అ పోహలు సృష్టించే వారికి కనువిప్పు కలిగిస్తామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ సింగారెడ్డి సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టాక శుక్రవారం తొలిసారి కడపలో పర్యటించారు. ఆయనకు పార్టీ నాయకులు, శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. కడపలో జిల్లా మేధావుల సంఘం ఆయనకు సన్మాన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లుఎత్తినా హంద్రీనీవా పనులు పూర్తి కాకపోవడంతో నీరు తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించిన నిధులు దారిమళ్లడమే కారణమన్నారు. ఉక్కు పరిశ్రమ, ఖనిజ ఆధారిత పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
28న ‘నాగార్జున’ దూరవిద్య యూజీ, పీజీ ప్రవేశపరీక్ష
ఏఎన్‌యూ, సెప్టెంబర్‌ 12 : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీహెచ్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశపరీక్ష ఈ నెల 28న జరుగుతుందని దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య ఎంవీ రాంకుమార్‌ శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 30 పరీక్షా కేంద్రాల్లో, 3వేలకుపైగా విద్యార్థులు ప్రవేశపరీక్షకు హాజరయ్యే అవకాశంఉందన్నారు. ఆసక్తిగలవిద్యార్థులు, తమకు సమీపంలోని దూర విద్య కేంద్రం అఽధ్యయన కేంద్రంలో ఈ నెల 10లోగా సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో నుంచి పొందవచ్చని ఆయన తెలిపారు.