Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:26AM

ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇల్లు ముట్టడి

ప్రత్యేక రాయలసీమ కోసం
మద్దతివ్వాలని విద్యార్థి, ప్రజాసంఘాల డిమాండ్‌

నంద్యాల, సెప్టెంబర్‌ 12: కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి ఇంటిని విద్యార్థి, ప్రజాసంఘాలు శుక్రవారం ముట్టడించాయి. రాయలసీమ మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్‌ కడియం సాంబశివుడు, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఆర్‌ఎన్‌ రాజునాయుడు, ఏపీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎం.నవీన్‌, గిరిజన విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాయక్‌ ఆధ్వర్యంలో నంద్యాలలోని ఎంపీ ఇంటిని ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై సీమ ప్రజాప్రతినిధులు నోళ్లు విప్పాలని అన్నారు. రాయలసీమ వెనకబాటుతనంపై ఎస్‌పీవైరెడ్డి స్పందించాలన్నారు. చంద్రబాబు మంత్రులను, ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా మాట్లాడనీయకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడను రాజధానిగా ప్రకటించినప్పుడు సీమలోని 52 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఎవ్వరూ కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని, పార్లమెంట్‌, అసెంబ్లీల్లో సీమ వెనుకబాటుతనంపై చర్చించాలని కోరారు.
త్వరలో సీమ రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తూ నాలుగు జిల్లాల్లోని శాసనసభ్యుల ఇళ్లను ముట్టడించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్‌వీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నవీన్‌, కార్యదర్శులు విజయభాస్కర్‌, నరసింహారెడ్డి, అంబేద్కర్‌ యువసేన జిల్లా కన్వీనర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.