Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:26AM

అన్నివర్గాలకు రాజకీయ భిక్షపెట్టింది ఎన్టీయారే : బాలకృష్ణ

హిందూపురం, సెప్టెంబర్‌ 12 : బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా అణగదొక్కుతున్న తరుణంలో టీడీపీని స్థాపించి అన్ని వర్గాలకూ రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత నందమూరి తారకరామారావుకే దక్కిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. అన ంతపురం జిల్లా హిందూపురంలో శుక్రవారం ఆయన మాట్లాడు తూ పేద, ధనిక తేడా లేకుండా అన్ని కులాలు, మతాల వారిని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది టీడీపీయేనన్నారు. తెలుగువారు ప్రపంచంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ అక్కడ తమ ఉనికిని చాటుకుంటున్నారన్నారు. విదేశాల్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో తమదైన ముద్ర వేసుకుని తెలుగుజాతికి కీర్తిని తెస్తున్నారని కొనియాడారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఎనలేని కృషి చేస్తోందన్నారు. ప్రతి ఇంటికీ ఐటీ రంగం ఉపయోగపడే విధంగా చంద్రబాబు చేస్తున్న కృషిని కొనియాడారు. కృష్ణా జలాల ద్వారా అనంతపురం జిల్లా చెరువులు నింపుతామన్నారు. ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి భూగర్భ జలాలను సంరక్షించుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తామన్నారు. ముఖ్యంగా రుణమాఫీని అమలు చేసి తీరుతామన్నారు.