Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:25AM

నాసిరకం మందులపై విచారణ

మూడువారాల్లో ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవ కార్డుల జారీ 

ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌
తిరుమల, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రులకు నాసిరకం మందుల సరఫరాపై విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం ప్రారంభ సమయంలో దర్శించుకున్న ఆయన.. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఆ మందులు కూడా గత ప్రభుత్వ హయాంలో సరఫరా అయ్యాయని ఆయన చెప్పారు. మందులను పరీక్షించిన తర్వాత నాసిరకమని సమాచార హక్కు చట్టం ద్వారా తేలిన విషయం తాను పత్రికల్లో చూసి ఆవేదన చెందానన్నారు. వీటిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించానన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జనరిక్‌ మందులను అందుబాటులోకి తెస్తామన్నారు. మూడు వారాల్లో ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవ కార్డులను జారీచేస్తామన్నారు. పాత పేర్లను మరిచిపోదామని, కొత్తగా ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవ (రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి) పేరును ఖరారు చేస్తామని, దానిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకోసం ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దింపుతామన్నారు. తిరుపతిలో 14వ ఆర్థిక సంఘం సమావేశం జరుగుతున్న కారణంగా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. 8ాఒ