Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:24AM

నోటీసులిచ్చాకే భూముల రిజిస్ర్టేషన్‌

చట్ట సవరణకు ఏపీ సర్కారు యోచన
హైదరాబాద్‌ : నూతన రాజధాని నిర్మాణం సందర్భంగా భూముల ధరలకు, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజిసే్ట్రషన్ల విధానం, భూముల లావాదేవీలు, అగ్రిమెంట్ల విధానాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. వీటి అధ్యయన బాధ్యతలను రెవెన్యూ, రిజిసే్ట్రషన్‌ శాఖలకు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుత భూముల రిజిసే్ట్రషన్‌, పట్టాదార్‌ పాస్‌ పుస్తకం చట్టా(1971)న్ని సవరించాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ముం దస్తు నోటీసులతో రిజిసే్ట్రషన్‌ విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనను అధికారులు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఒక గ్రామంలోని 10 ఎకరాల భూమిని ఓ వ్యక్తి కొనుగోలుచేసి రిజిసే్ట్రషన్‌ చేయించుకోవాలనుకుంటే ముందుగా... ఆ భూమి కొనుగోలుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటూ సబ్‌రిజిసా్ట్రర్‌ నోటీసులు జారీ చేస్తారు. నిర్ధిష్ట కాలవ్యవధిలో ఆ నోటీసులపై చట్టపరమైన కేసులున్నాయని ఆధారాలతో వస్తే రిజిసే్ట్రషన్‌ను నిలిపివేస్తారు. ఎలాంటి అభ్యంతరాలు రాకుంటేనే రిజిసే్ట్రషన్‌ చేయాలి. ఇదే విధానాన్ని ఇళ్లు, ప్లాట్ల రిజిసే్ట్రషన్‌లోనూ వర్తింపచేయాలి. ఈ విధానం ద్వారా అక్రమంగా భూముల రిజిసే్ట్రషన్‌ను నివారించవచ్చు. కోనేవారు,అమ్మేవారు నిజమైన హక్కుదారులా? కాదాకూడా తెలుసుకోవచ్చు. ఇంకా అనేక అంశాలను పొం దుపరుస్తున్నాం. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే అమల్లోకి వస్తాయి’’ అని రిజిసే్ట్రషన్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ కసరత్తు కొలిక్కిరావడానికి మరో 15 రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. శ్రీ1.థి,్శ/వూ