desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:19AM

ఏబీవీపీ నగర మహాసభలు విజయవంతం

గర్మిళ్ల : మంచిర్యాల పట్టణంలోని ఎంవీ ఎన్‌ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఏబీవీపీ నగర మహాసభలు విజయవంతమయ్యాయి. తూర్పుజిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలతో పాటు పలు కళాశాలలకు చెం దిన ఇంటర్మీడియట్‌, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. సభలకు ముఖ్య అతిథిగా ఏబీవీపీ ప్రాంత సహ సంఘటన కార్యదర్శి రాము పా ల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యారంగ సమస్యలు, సామాజిక సమస్యలపై పలు తీర్మాణాలు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపుల ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం అందజేయడం, ప్రైవేటు కళాశాలల సిండికేట్‌ ఆగడాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనే తదితర తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు ఎం. భరత్‌కుమార్‌, జిల్లా కన్వీనర్‌ జుమ్మిడి రాకేష్‌, కోకన్వీనర్లు సీహెచ్‌. కృష్ణదేవరాయలు, ఈసారపు రాకేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్‌తో పాటు పలువురు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎంపిక
ఏబీవీపీ నగర మహాసభల్లో భాగంగా నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మంచిర్యాల నగర అధ్యక్షునిగా అరవింద్‌రెడ్డి, కార్యదర్శిగా అశ్విన్‌రెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జులుగా ప్రశాంత్‌, మల్లేష్‌, వికేష్‌, వెంకటేష్‌, కుమారస్వామి, రహమాన్‌, ఉపాధ్యక్షులుగా రిత్విక్‌, శ్రీకాంత్‌, సాందీపని ఇన్‌చార్జ్‌గా బి. శ్రీనివాస్‌, టెక్నికల్‌ సెల్‌ కన్వీనర్‌గా జి. సాయికృష్ణ, విద్యార్థి శక్తి ఇన్‌చార్జ్‌గా పి. అజయ్‌, స్టడీ సర్కిల్‌ ఇన్‌చార్జ్‌గా వంశీ, మీడియా సెల్‌ ఇన్‌చార్జ్‌గా నాగమల్లేష్‌, మహిళ సహాయ కార్యదర్శులుగా మేఘ న, శ్వేత, కార్యవర్గ సభ్యులుగా హరీష్‌, శ్రావ ణ్‌, ప్రదీప్‌, సాజిత్‌, లింగమూర్తిఎన్నికయ్యారు.