desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:19AM

ఇల్లు కళ కళ..

మంచిర్యాల టౌన్‌ : ఇల్లు అందాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడానికి అందమైన ఫర్నిచర్‌పై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఎంత ఖర్చయినా గానీ ఇంటికి అనుగుణంగా ఫర్నీచర్‌ను తెచ్చి పెడుతున్నారు. ఇటీవల రెడీమేడ్‌గా తయారు చేసి విక్రయించే షాపులు వెలుస్తుండడం, ధరలు కూడా అనుగుణంగానే ఉండడంతో వినియోగదారులు ఫర్నీచర్‌ షాపులకు ఎగబడుతున్నారు. జిల్లాలో ఫర్నీచర్‌ వ్యాపారులు మేళాలు నిర్వహిస్తూ డిస్కౌంట్లపై అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సోఫాసెట్‌, డైనింగ్‌ సెట్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌, బేబీడెక్స్‌, టీవీ స్టాండ్స్‌, మంచాలు, అల్మారాలు, కేన్‌తో తయారు చేసిన సోఫాసెట్స్‌, ఉయ్యాలలు అందుబాటులో ఉన్నాయి. మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ వ్యాపార కేంద్రాలలో ఆయా ఫర్నీచర్‌ షాపుల్లో పెద్ద ఎత్తున అమ్మేందుకు ఏర్పాటు చేశారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన ఫర్నీచర్‌ను అందుబాటులో ఉంచారు. సోఫాసెట్‌ 14 వేల నుంచి 30 వేల రూపాయల వరకు, డైనింగ్‌ టేబుల్‌ 5 వేల నుంచి 55 వేల రూపాయల వరకు, మంచాలు 3500 నుంచి 35,000 రూపాయల వరకు, టీవీస్టాండ్‌లు వేయి నుంచి 4 వేల రూపాయల వరకు, ఉడెన్‌ సోఫాసెట్‌లు 8వేల నుంచి 40 వేల రూపాయల వరకు, ఉయ్యాల 18 వేల నుంచి 35 వేల రూపాయల వరకు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ 1800 నుంచి 7500 రూపాయల వరకు, కేన్‌ సోఫాలు 6 వేల నుంచి 10 వేల రూపాయల వరకు, బేబీ డెక్స్‌ 500 నుంచి 3 వేల రూపాయల వరకు, కంప్యూటర్‌ టేబుల్స్‌, ఆఫీసర్‌ ఫర్నీచర్‌, అల్మారాలు ఆయా రేట్లలో లభిస్తున్నాయి.
అమ్మకాలు బాగానే ఉన్నాయి
- ఎం. రాము, సావిత్రి ఫర్నిచర్స్‌ యజమాని
వివిధ రకాల ఫర్నిచర్‌పై ప్రజలు మక్కు వ చూపడంతో దాదాపు 2 వేలకు పైగా రకాల ఫర్నీచర్‌ను మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేశాం. మలేషియా, చైనా దేశాలతో పాటు ముంబై, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఎన్నో రకాల డిజైన్లతో కూడిన ఫర్నిచర్‌ను ప్రజల అభిరుచికి అనుగుణంగా తెచ్చిపెట్టాం. ధరలు కూడా అందుబాటులోనే నిర్ణయించాం. ప్రస్తుతం కొనుగోళ్లు బాగానే కొనసాగుతున్నాయి. ప్రజల ఆసక్తిని బట్టి ఫర్నిచర్‌ డిజైన్లలో కూడా మార్పులు తీసుకొచ్చాం.