Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:19AM

ఆర్కే7 గని పని స్థలాలను పరిశీలించిన టీబీజీకెఎస్‌ నాయకులు

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌లోని ఆర్కే7గనిలోని భూ గర్భ స్థలాలను శుక్రవారం మొదటి బదిలీలో గుర్తింపు సంఘం టీబీజీకెఎస్‌ నాయకులు గనిలోకి దిగి పరిశీలించారు. గనిలోని 2బిసీంలో గల పని స్థలాలలో కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. గనిలోని పని స్థలాల్లో తగినంత వెంటిలేషన్‌ లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అధి కారులకు సూచించారు. వెంటిలేషన్‌ సరిగా లేకపోతే కార్మికులు అస్వస్థకు గురై ప్రాణాపాయ స్థితి కి చేరుకుంటారని హెచ్చరించారు. లోహైట్‌ సీంలలో కార్మికులు కోల్‌ ఫిల్లింగ్‌ చేయడం కష్టతరంగా ఉం దని బాటం టన్నెల్‌ పనులు చేపట్టాలనిఅధికారులకు సూచించారు. బాటం దగాయించి కార్మికులకు వంగి తట్టమోసే ఇబ్బంది లేకుండ చూ డాలని అధికారులకు సూచించారు.ఈకార్యక్రమంలో గని వెంటిలేషన్‌ అధికారిప్రభాకర్‌రావు, టీబీజీకెఎస్‌ ఉపాధ్యక్షులు బండి రమే ష్‌, డివిజన్‌ కమిటి ప్రతినిధులు లెక్కల విజయ్‌, సత్తయ్య, మల్లేష్‌, సంజీవ్‌, రమేష్‌, సమ్మిరెడ్డి, పని స్థలాలను సందర్శించారు.