desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:19AM

యూనియన్‌లు కార్మికులకు చేసిందెంత...?

(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల) :
తెలంగాణ రాష్ట్ర సాదనలో సింగరేణి కార్మి కుల పాత్ర అత్యంత కీలకమైంది. ఇది జగ మెరిగిన సత్యం. తెలంగాణ కోసం మొట్ట మొదటి సమ్మె చేసింది కూడ సింగరేణి కార్మి కులే. ఈ విషయము సత్యమే. అలాంటి సింగ రేణిలో యూనియన్‌ల కార్యాకలాపాలకు, ఉద్య మాలకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మంట కలిసే విధంగా ప్రస్తుత పరిస్థితులు తయార య్యాయి. 1932లో ఎలాంటి సంఘం లేకుండా ఉబ్బసిలాల్‌ ఫసీ అనే కార్మికుడు నేతృత్వంలో మొట్టమొదటి సారి హక్కుల కోసం బ్రిటీషు జమానాలనే సమ్మె చేసిన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉంది. మస్టర్ల కోత చట్టానికి వ్యతి రేకంగా 56రోజులు సమ్మె చేసింది సింగరేణి కార్మికులే. సింగరేణిలో ఎన్నికలు జరిపిన తరు వాత పదహారు సార్లు గోల్డెన్‌ హ్యాండ్‌ షేక్‌ పథ కాన్ని అమలు చేసి 25వేల మంది కార్మికులను తగ్గించేశారు. గుర్తింపు, గుర్తింపేతర సంఘా లు, సంప్రదింపుల హోదా సంఘాలు అంటూ ఎన్నికల తరువాత సంఘాలు చీలిపోయి కార్మికులలో ఐక్య ఉద్యమాలే లేకుండా అయ్యాయి. యూనియన్‌కు సభ్యత్వం పేరిట చందాలు, పేషిట్‌ రికవరీ ద్వారా వెళ్తున్నప్పటికి అవి చాలవన్నట్లు లక్షల రూపాయలు పోస్టింగ్‌లు, ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు, మెడికల్‌ అన్‌ఫిట్ల పేరిట నాయకులు లంచాలు తీసుకుంటున్నారని కార్మికులు బాహాటంగా పేర్కొంటున్నారు. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ప్రస్తుతం యూనియన్‌ నాయకులలో కొరవ డింది. ఐదుసార్లు సింగరేణిలో ఎన్నికలు జరి గాయి. సాధించింది ఏమిలేదు. కాని పోగొట్టిందే ఎక్కువ. పోగొట్టుకున్నది ఎక్కువే.. కార్మికుల పట్ల ప్రేమ, ఆత్మీయత, వారి సమస్యను తమ సమస్యగా భావించే నాయకులే లేకుండా పోయారని కార్మిక వర్గం గనుల్లో ఆందోళన పడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా బొగ్గుకు మండే గుణం ఉన్నట్లు గని కార్మికుడికి కూడా తిరుగుబాటు చేసే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే గుణం ఉందనే విషయాన్ని కార్మిక సంఘాలు గుర్తుం చుకోవాల్సిన అ వసరం ఉంది. నెత్తికెత్తుకున్న వాళ్లే నేలకేసీ కొడుతారనే విషయాన్ని గత అనుభవాలను గుణపాఠంగా తీసుకుంటే మంచిదనే విషయాన్ని సీనియర్‌ కార్మిక వర్గం పేర్కొంటున్నారు. ఏ సంఘమైనా ఎంతటి పెద్ద వారైనా సమస్యలను నిజాయితీగా పరిష్క రించడానికి ముందుకు వస్తే తప్ప మనుగడ ఉండదనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బొగ్గు గని కార్మికులు ఎక్కువగా ఇష్టపడే టీఆర్‌ఎస్‌ అధి నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. 100రోజుల పాలన కూడా పూర్తి అయింది. కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం ఇంక్రిమెంట్‌ కూడా ప్రకటించారు. ఇంకా చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరించడం కోసం సీఎం ఆదేశం మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికసంఘాలు న్యాయంగా పనిచేయాలని కార్మికులకు ప్రయోజనం చేకూర్చాలని వారు ఆశించడంలో తప్పులేదు. ఆ దిశగా యూనియన్‌ సంఘాల నాయకులు ప్రయాణించాలి.ఙ