Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:19AM

జిల్లాలో తెలంగాణ కళలు, సంస్కృతి, పరిరక్షణకు పోటీలు

బెల్లంపల్లి: తెలంగాణ కళలు, సంస్కృతిని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ సూచన మేరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సంస్కృతిక ఇతర అంశాల్లో యువజనోత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో యువజన సంఘాలు, కళాకారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో యువజనోత్సవాలు, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 15నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు పాల్గొనాలని ఆయన సూచించారు. కూచిపూడి, భరతనాట్యం, హిందూస్తాన్‌ ఊకల్‌, సితార్‌, వన్‌యాక్టుప్లే, మిమిక్రీ, ఫ్యాన్సీడ్రెస్‌, మ్యాజిక్‌, ఇతర నృత్యాలు ఫోక్‌ డ్యాన్స్‌ (గ్రూపు), భరతనాట్యం, (గ్రూపు), ప్లూట్‌, తబల, క్విజ్‌, టాకింగ్‌డాల్‌,గ్రూప్‌ డిస్కషన్‌, కర్నాటక హుకల్‌ తదితర 33రకాల అంశాలపై పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ పోటీల్లో ప్రావీణ్యం ప్రదర్శించిన కళాకారులను ఆదిలాబాద్‌లో జరిగే జిల్లా స్ధాయి పోటీల్లో ఆ తర్వాత హైద్రాబాద్‌లో రాష్ట్ర స్ధాయి పోటీలు, ఢిల్లీలో జాతీయ స్ధాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. బెల్లంపల్లి, భీమిని, కాసిపేట, తాండూర్‌, వేమనపల్లి, నెన్నెల, మందమర్రికి చెందిన కళాకారులు బెల్లంపల్లిలో జరిగే సంస్కృతిక పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ ఎంపీడీఓ శేషుకుమార్‌, తహసీల్దార్‌ శ్యామలాదేవి, మున్సిపల్‌ కమీషనర్‌ మల్లారెడ్డి, యువజన, మహిల సంస్థల ప్రతినిధులు తాళ్ల కృష్ణమోహన్‌, రాకేష్‌, దాసరి విజయ, ప్రవీణ్‌, తిరుపతి, మధు, తదితరులు పాల్గొన్నారు.