desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:18AM

బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాలి

బెల్లంపల్లి: ఆదిలాబాద్‌ జిల్లాలో తూర్పు ప్రాంతంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడలిగా ఉన్న బెల్లంపల్లి పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమురాజుల శ్రీదేవి తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెల్లంపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అనుకూల పరిస్థితులున్నాయని, ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం మంచిర్యాల జిల్లా ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. బెజ్జూరు,కౌటాల, వాంకిడి, కెరమెరి, వేమనపల్లి, సిర్పూర్‌ టి, కాగజ్‌నగర్‌, రెబ్బెన, తాండూర్‌, నెన్నెల, భీమిని, మందమర్రి, కాసిపేట, ఆసిఫాబాద్‌, తిర్యాణి, కోటపల్లి మండలాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సౌలభ్యాన్ని భౌగోలిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ప్రకటించాలని ఆమె కోరారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే నిరంతర పోరాట కార్యక్రమాలు చేపడతామని ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు.
త్వరలో ముఖ్యమంత్రిని
కలుస్తాం-సబ్బనికృష్ణ
బెల్లంపల్లి జిల్లా సాధనకు పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి సబ్బనికృష్ణ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి జిల్లాలోని తూర్పు ప్రాంతంలో గల ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్న బెల్లంపల్లి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాల్సిన ప్రభుత్వం కొందరి స్వలాభం కోసమే మంచిర్యాలను జిల్లాగా ప్రకటించడం గర్హనీయమన్నారు. జిల్లా ఏర్పాటుకు ఇక్కడ సరిపడ భూములు, అడిషనల్‌ ఎస్పీ తదితర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలు ఉన్నాయని సింగరేణి ఖాళీ స్థలాలు, భవనాలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎంసీపీఐయూ నాయకులు లింగంపల్లి భీమేష్‌, పసులేటి వెంకటేష్‌, కొట్రంగి రాజు, సబ్బని రాజేంద్రప్రసాద్‌, సబ్బని అరుణ్‌, మేకల రాము, మనికంట, తాళ్లపల్లి రాజలింగు, తదితరులు పాల్గొన్నారు.