Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:18AM

వెక్కిరించిన విధి

రామకృష్ణాపూర్‌: అంగవైకల్యం శరీరానికే తప్ప మనసుకు కాదంటూ ఓ వికలాంగుడు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ జీవితాన్ని సాగిస్తుంటే స్పైనల్‌కార్డ్‌ దెబ్బతినడం ఆ కుటుంబాన్ని పూటగడవటమే కష్టం గా మార్చింది. మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన ఇందూరి రమేష్‌కు భార్య విజయ, ఇద్దరు కుమారులు గత రెండేళ్లుగా స్పైనల్‌కార్డ్‌ వ్యాధితో తీవ్ర ఇబ్బందు లు పడుతున్నాడు. వికలాంగుడైన రమేష్‌ కూలీనాలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆస రాగ ఉన్న క్రమంలో ఈ వ్యాధి తీవ్రమై యూ ఆకారంలో స్పైనల్‌కార్డ్‌ ఒంగిపోయింది. దీంతో రక్త ప్రసరణ నడుము నుంచి కింది భాగాలకు నిలిచిపోయింది. కనీసం మలవిసర్జన కూడా చేయలేని పరిస్థితి. సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడైన తండ్రి నాగయ్య కుమారుడికి ఆపరేషన్‌ చేయిస్తేనైనా కొంత కుటుంబాన్ని నడిపిస్తాడని ఆపరేషన్‌ కోసం రిటైర్‌మెంట్‌ డబ్బులు రూ.4లక్షలు వైద్యం కోసం ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొంతమంది వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ప్రేమ్‌ హాస్పిటల్‌లో 21మంది వైద్యుల ఆధ్వర్యంలో మరల 8లక్షలు ఖర్చుచేసి శస్త్ర చికిత్స చేశారు. అయితే వైద్యులు రెండేళ్లపాటు మంచంలోనే ఉండాలంటూ సూచించడంతో ఆ కుటుంబానికి పూట గడవటం కష్టంగా మారింది. ఆపరేషన్‌ గత ఫిబ్రవరిలో జరగడంతో రోజుకు రూ.3వేల చొప్పున వైద్యం కోసమే ఖర్చు అవుతుండటంతో తమ భాధలు వర్ణనాతీతంగా ఉన్నాయంటూ వారు ఆంధ్ర జ్యోతితో గోడువెల్లబుచ్చారు. ప్రభుత్వం నుంచి తమకు ఆర్థిక సాయం అందేలా ప్రజాప్రతినిధులు కృషిచేసి కుటుంబానికి ఆపన్న హస్తం అందించాలన్నారు. వివరాలకుసెల్‌: 961851 8956 కు సంప్రదించాలని వారు వేడుకుంటున్నారు. వికలాంగుల కోసం వీహెచ్‌పీఎస్‌ అనే సంఘానికి మందమర్రి మండల అధ్యక్షుడిగా సేవలు చేసిన రమేష్‌కు సాయం చేయలంటూ కుటుంబీకులు కోరుతున్నారు.