Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 00:18AM

గ్రామ మొబలైజర్‌ల నియామకానికి కసరత్తు

ఉట్నూర్‌: జిల్లాలోని ఏజెన్సి ప్రాంతాలో ఉన్న 235 గ్రామ పంచాయతీలలో పెసా చట్టం అవగాహన పరచడానికి 235మంది గ్రామ మొబలైజర్‌ల నియామకానికి కసరత్తు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య తెలిపారు. శుక్రవారం ఉట్నూర్‌ వచ్చిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ గ్రామ సభలకు ప్రజలు అందరు హాజరయ్యేలా అవగాహన పరచడానికి మొబలైజర్‌లను నియమిస్తామని అన్నారు. గత నెలలో ప్రభుత్వం పంచాయత్‌రాజ్‌ శాఖ ద్వారా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ అపార్డ్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పెసాచట్టం అమలు కోసం ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలోమొబలైజర్లను నియమించాలని సూచించినట్లు తెలిపారు. గ్రామ పరిపాలనలో గ్రామ పంచాయతీల పాత్ర, పంచాయతీలకు వస్తున్న నిధులు, పంచాయతీల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలందరికి తెల్పడమే కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడ తెలుసుకోనే అవకాశాలు గ్రామ సభల ద్వారానే తెలుస్తుందని, ప్రజలకు వివరించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. స్థానికులై ఉన్న నిరుద్యోగులు పదవ తరగతి వరకు చదువుకున్న వారిని నియమించడం జరుగుతుందన్నారు. ఈమేరకు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డిడిలతో సమన్వయంచేస్తన్నామన్నారు. జిల్లాలో 580 క్లస్టర్లలో 248 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఇటీవల నియమించామని, ఇది వరకు 188మంది పనిచేస్తున్నారని, మరో 150 పంచాయతీ సెక్రటరిల ఖాళీలు ఉన్నాయన్నా రు.మన ఊరు,మన ప్రణాళికల ద్వారా గ్రామా ల అభివృద్దికి ప్రభుత్వం కృషిచేస్తుందనితెలిపారు.