Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 23:19PM

బంపర్‌హిట్‌ కోసం ఎదురుచూస్తున్నా

‘‘నా కెరీర్‌లో ‘బంపర్‌ ఆఫర్‌’ నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తరహా విజయం కోసం అంటే బంపర్‌ హిట్‌ కోసం మరలా ప్రయత్నిస్తున్నా’’ అని అంటున్నారు హీరో సాయిరామ్‌ శంకర్‌. శనివారం పుట్టినరోజును జరుపుకుంటున్న సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదలైన నా ‘రోమియో’ ట్రైలర్స్‌కి, పాటలకి మంచి స్పందన వస్తోంది. అక్టోబర్‌లో ‘రోమియో’ విడుదల కానుంది. తాజాగా తమిళ నటుడు శరత్‌కుమార్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాను. ఈ సినిమాకు సుదర్శన్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తారు. ఈ నెల 15 నుంచి షూటింగ్‌ మొదలవుతుంది. ఈ చిత్రంతో పాటు ‘జగదాంబ’ అనే సినిమా కూడా చేస్తున్నాను. ఈ సినిమాను వాసుదేవ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్లుగా రూపొందనున్నాయి. ఇవి మంచి విజయాన్ని నమోదు చేసుకుంటాయనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.