Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 03:17AM

2 రోజులు ఆగండి
ఏం చేస్తామో మీరే చూస్తారు


 

ప్రారంభించి గంటకే ఆపేశారు
- దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం : జవదేకర్‌

హైదరాబాద్‌,మెదక్‌, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 చానళ్ల ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్‌వోలపై చర్యలకు రెండు రోజులు ఓపిక పట్టాలని.. ‘తర్వాత ఏం చర్యలు తీసుకుంటామో మీరే చూస్తారు’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌.. చానళ్ల నిలిపివేత విషయాన్ని ముందుగా మంత్రి దృష్టికి తెచ్చారు. ‘‘ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకుంటామని మీరు చెప్పినా...ఇప్పటివరకు ఎలాంటి చర్యా ఎందుకు తీసుకోలేదు’’ అని..‘‘పైగా తెలంగాణ సీఎం మీ వద్దకు వచ్చి చానళ్ల ప్రసారాల సీడీలను చూపించానని, ప్రకాష్‌ జవదేకర్‌ కన్విన్స్‌ అయ్యారని చెప్పుకొంటున్నార’’ని వివరించారు. దానికితోడు... మీడియా తమకు శాల్యూట్‌ చేయాలని, లేకపోతే 10 కిలోమీటర్ల లోతున భూమిలో పాతర వేస్తామంటూ హెచ్చరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. కేసీఆర్‌ చూపించిన సీడీలతో తాను కన్విన్స్‌ అయ్యానని ఎవరు చెప్పారంటూ జవదేకర్‌ ప్రశ్నించారు. ఈ అంశంపై రాజ్యసభలో చర్చ జరిగిన వెంటనే.. చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలంటూ ఆదేశించామని తెలిపారు. ఆదేశాల నేపథ్యంలో ఒక గంట..ప్రసారాలను కొనసాగించి, మళ్లీ నిలిపివేశారని చెప్పారు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. ‘‘ఏబీఎన్‌ చానల్‌ ఎలాంటి తప్పూ చేయకపోయినా ప్రసారాలను ఎందుకు నిలిపివేశారు’’ అని అమర్‌ మళ్లీ ప్రశ్నించారు. ఆ విషయం అంతా తెలుసన్నారు. అయితే మీడియా కూడా బాధ్యతాయుతంగా మెలగాలని, స్వీయ నియంత్రణ పాటించాలని హితవు పలికారు.

జోక్యం చేసుకుని పరిష్కరించండి
సీఎం కేసీఆర్‌.. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఉద్యోగులు.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం బీజేపీ కార్యాలయంలో వారు మంత్రిని కలిశారు. మీడియాను పది కిలోమీటర్ల లోతును పాతరేస్తామం టూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై జోక్యం చేసుకొని, ఈ అంశాన్ని పరిష్కరించాలని జవదేకర్‌ను కోరారు. మీడియా పై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్‌ ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.