Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 03:01AM

బదిలీలపై చెక్‌పోస్టు అధికారుల మల్లగుల్లాలు

తడ: చెక్‌పోస్టులో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇన్స్‌పెక్టర్ల బదిలీల విషయంలో ఆయా శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. వాణిజ్యపన్నులశాఖలో విధుల నిర్వహించే వీరిని యేడాదికోమారు బదిలీ చేస్తుంటారు. జిల్లాలో సంబంధితశాఖ కార్యాలయాల్లో ఉండే జూనియర్‌ అసి స్టెంట్లు, ఎల్‌డీసీలను ఈ స్థానాల్లో డిప్యూటేషన్‌పై భర్తీ చేస్తుంటారు. అయితే ఎటువంటి రిమార్కులు లేనివారిని ఇక్కడ నియమిస్తుంటారు. ప్రస్తుతం వాణిజ్యపన్నులశాఖలో ఆరో పణలు లేని వారు కేవలం 6 మందే ఉన్నట్లు తెలిసింది. మిగతా వారంతా ఏదో ఒక కేసులోనూ, ఏసీబీ దాడుల సమయంలోనూ, పేర్లు నమోదై (నాన్‌ఫోకల్‌ సిబ్బంది) ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని చెక్‌పోస్టులో నియమించేందుకు అధికారులు సమ్మతించడం లేదని సమాచారం. సంబంధిత కేసుల్లో పేర్లు నమోదయ్యిందే తప్ప నేరం రుజువు కానందు వల్ల తమను చెక్‌పోస్టులో నియమించాలంటూ కొంతమంది ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్‌ జాబితాలో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్లతో పాటు సీనియర్‌ అసిస్టెంట్లను డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమించాలంటూ సంబంధిత కమిషనర్‌కు చెక్‌పోస్టు అధికారులు లేఖ రాసినట్లు సమాచారం. ఏదీ ఏమైనా ఇప్పటి వరకు చెక్‌పోస్టులో ఎటువంటి ఆరోపణలు లేనివారే విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో పాత విధానాన్నే అవలంబిస్తారో లేక చరమగీతం పాడతారో వేచి చూడాల్సిందే.