desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 03:01AM

వైభవంగా రాజరాజేశ్వరి దీక్షామాలఽధారణ

నెల్లూరు (సాంస్కృతికం) : అది శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం. గురువారం ఎటుచూచినా ఎర్రటి వసా్త్రలు ధరించిన భక్తులే. ఓంశక్తియే.. ఆదిపరాశక్తియే అంటూ వారు రాజరాజేశ్వరి అమ్మవారి నామస్మరణలు ఆలయంలో మారుమోగాయి. ఈ దృశ్యాలన్నీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలదీక్షల సందర్భంగా జరిగాయి. రాజరాజేశ్వరి అమ్మవారి మహాత్యాన్ని చాటేందుకు ఏడేళ్ల క్రితం మాలాధారణ ప్రారంభమైంది.రాజరాజేశ్వరి సేవా సంస్థ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి స్వంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్నారు. భవానీ దీక్షలు చేపట్టే భక్తులు సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తున్నది. ఈ సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం అభిషేకం, నవావరణ పూజ, అష్టోత్తర శతనామపూజలు, సుందరేశ్వరస్వామికి మహాన్యాస రుద్రాభిషేకాలు, గాయత్రీ దేవికి ప్రత్యేక పూజలు, ఛండీహోమాలు జరిగాయి. అమ్మవారి దీక్షా మాల ఽధరించే భక్తులతో సన్నపురెడ్డి పెంచలరెడ్డి దంపతులు తొలుత అమ్మవారికి పూజలు చేశారు. అలివెట్టి మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రత్యేక అలంకారం ఎదుట ఆలయ ప్రధాన అర్చకలు తంగిరాల రాధాకృష్ణశర్మ, సన్నపురెడ్డి పెంచలరెడ్డికి, భవానీలందరికీ దీక్షా మాలను ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ రత్నం జయరామ్‌, ఈవో పీ నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, పిండి సురేష్‌, జిల్లా ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ అధ్యక్షుడు దాసా లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శి మంచికంటి శ్రీనివాసులు, డీ.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.