Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:51AM

డ్రాపౌట్లకు వరం కస్తూర్బా... పెరుగుతున్న విద్యార్థుల సామర్థ్యం

గాలివీడు : అర్థాంతరంగా బడిమానివేసిన విద్యార్థినులకు వరం కస్తూరిభా గురుకుల పాఠశాల. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరమవుతున్న వారిని విద్యా స్రవంతిలోకి తీసుకొచ్చి సాధారణ విద్యార్థుల సామర్థ్యాలకు సమానంగా కస్తూరిభా పాఠశాల విద్యనంస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులు బడిమానివేయడంతో వ్యవసాయ కూలీలుగా, పశువుల కాపరులుగా, బాలకార్మికులుగా మారుతున్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన కొరబడి పిల్లల బంగారు భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. విద్యాహక్కుచట్టంతో పిల్లల వయస్సు ఆధారంగా బాలికలను కస్తూర్బా పాఠశాలలో చేర్చుకొంటున్నారు. మండలంలోని వెలిగల్లు రిజర్వాయర్‌ వద్ద కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయుల చొరవతో పెరిగాయి. ఈ పాఠశాలలో 198 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. స్థానిక కేజీబీవీలో వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థినీల మనోభావాలు వారి మాటల్లోనే...
ఆర్థిక పరిస్థితులు... అమ్మానాన్న లేక
అమ్మా నాన్న లేకపోవడం, అమ్మమ్మ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో బడిమానివేయాల్సి వచ్చింది. అవ్వ కూలి, నాలితో జీవనం సాగిస్తోంది. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ సహకారంతో కస్తూర్బా పాఠశాలలో చేరాను. పాఠశాలలో టైలరింగ్‌ టీచర్‌ ప్రోత్సాహంతో విద్యను అభ్యసిస్తున్నాను. వారి ప్రోత్సాహం లేకుంటే చదువుకు దూరమయ్యే దానిపి..
-కె.రాశి, 9వ తరగతి, ఆవులవాండ్లపల్లె
చదువుకొనసాగిస్తాననుకోలేదు
ఆగిపోయిన చదువును కొనసాగిస్తాననుకోలేదు. ఇంటిలోని పరిస్థితుల వలన చదువు మానేయాల్సి వచ్చింది. బంధువులు, మాఊరి ఉపాధ్యాయుడు శ్రీనివాసుల చొరవతో కస్తూరిబా పాఠశాలలో చేరాను. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉంది.
-శ్రీవిత, 9వ తరగతి, నల్లగుండ్లపల్లె
ఇంటి పనుల కోసం..
ఇంటి పనులు చూసుకోవడానికి బడిమానివేయాల్సి వచ్చింది. ఇంటిలో ముగ్గురు పిల్లలున్నారు. చదువుకోవాలనే ఆశ ఉంది. దీంతో ఉపాధ్యాయురాలు లక్ష్మి చొరవతో నెరవేరింది. ఉపాధ్యాయుల సూచనలకు తల్లిదండ్రులు స్పందించి పాఠశాలలో చేర్పించారు. కష్టపడి చదువుతాను.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
కేజీబీవీ పాఠశాలలో ప్రతి విద్యార్థినీపై ప్రత్యేక శ్రద్ధ, పర్యవేక్షణ చేస్తాం. గతంలో కంటే విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయి. ప్రస్తుతం 198 మంది విద్యార్థులు కలరు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అందిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతోంది.
-స్పెషలాఫీసర్‌ పద్మావతి