desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:50AM

విద్యార్థుల ఖాతాల్లోకే ఉపకార వేతనం

కడప చిన్నచౌకు : విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి ఉపకార వేతనం నిధులు వస్తాయని మై నార్టీ ఆర్థిక సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఢైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. 2014-2015 ఆర్థిక సంవ త్సరానికి ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనం మంజూ రు దరఖాస్తులు ఇప్పటికి 38 వేలు ఆన్‌లైన్‌లో చేరాయని, ఉపకార వేతనాల గడువు ఈనెల 20వ తేదీ వరకు పెంచడంతో వీటి సంఖ్య 50 వేలు దాటవచ్చన్నారు. స్థానిక పాత రిమ్స్‌లోని ఏపీఎంఎఫ్‌సీ కార్యాలయంలో గురువారం ఆ యన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతు న్న మైనార్టీ విద్యార్థులు భారత ప్రభుత్వంచే అమలు చేయబడుతున్న ఈ పథకాన్ని ఉప యోగించుకోవాలని కోరారు. ఉపకార వేతనం నిధులు నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. అయితే గత సంవత్సరం పరీక్షలలో 50 శాతం ఆపై మార్కులు వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రాధాన్యతను ఇస్తారన్నారు. విద్యార్థులకు బ్యాంకు అకౌంట్‌ ఖచ్చితంగా ఉండాలి బ్యాంకు ఖాతా నెంబర్‌తో పాటు పాస్‌బుక్‌ జిరాక్స్‌ కాపీని జతపరిచి పంపాలన్నారు. బ్యాంకు ఖాతా లేని దరఖాస్తులు పరిశీలించబడవన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు ఈనెల 20 చివరి తేదీ అన్నారు. పూరించిన దరఖాస్తులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి తనిఖీ అయిన తర్వాత మొత్తంగా ఏపీ ఎంఎఫ్‌ఈ కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా అందించాలన్నారు. మిగతా వివరాలకు 08562-241137, 9849901140లకు సంప్రదించాలని కోరారు.