Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:46AM

చోడవరంలో జర్నలిస్టుల ఆందోళన

చోడవరం: తెలంగాణాలో టీవీ చానళ్ల ప్రసారాల నిలిపివేత, మహిళా జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గురువారం ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా జర్నలిస్టులు పట్టణంలో ఆందోళన చేపట్టారు. తెలంగాణలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానళ్ల పట్ల ప్రభుత్వ దమన నీతిపై ధ్వజమెత్తారు. స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ నుంచి కొత్తూరు జంక్షన్‌ వరకూ ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు, కొత్తూరు జంక్షన్‌లో మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. తక్షణమే ఈ చానళ్ల ప్రసారాలను పునఃప్రారంభించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే చోడవరం శాఖ అధ్యక్షుడు వి.జోజి, కార్యదర్శి ఎన్‌.రాజగోపాల్‌, చోడవరం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కొప్పాక భాస్కరరావు, జిల్లా ఎలక్రానిక్‌ మీడియా జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి రాంబాబు, డీవీఎం నాయుడు, చోడవరం అధ్యక్షుడు యల్లపు శ్రీనివాసరావు, సత్యనారాయణ, నానాజీ, కిశోర్‌, రామకృష్ణ, ఈశ్వరరావు, పుట్టా హనుమంతరావు ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షుడు కోవెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఆందోళనకు స్థానిక న్యాయవాదుల సంఘం ప్రతినిధి చీపురుపల్లి శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త రమేశ్‌ తదితరులు సంఘీభావం తె లిపారు.