
అరక రూరల్: మేజర్ పంచాయతీలోని ప్రజలంతా ఆధార్ నమోదు చేసుకునేలా కృషి చేస్తామని సర్పంచ్ సమర్డి గులాబీ తెలిపారు. గురువారం వెంకటేశ్వర కఆ్యణ మండపంలో ఆధార్ కమిటీని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ కమిటిలో సర్పంచ్, వీఆర్వో, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉంటారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే ఆధార్ తప్పనిసరని, ఈ విషయాన్ని గుర్తించి నమోదుకు ఆధార్ కమిటీ కృషి చేయాలని జడ్పీటీసీ సభ్యురాలు కె.వనజ సూచించారు. గ్రామసభకు వీఆర్వోలు జగ్గాయమ్మ, బీబీ.ప్రసాద్, ఉప సర్పంచ్ సత్యానందం, పెదలబుడు మాజీ సర్పంచ్ రఘునాఽఽథ్, భీమరాజు పాల్గొన్నారు.