Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 02:46AM

అంగన్‌వాడీ పోస్టుల నియామకంలో అక్రమాలు

ముంచంగిపుట్టు: మండలంలో అంగన్‌వాడీ లింక్‌ వర్కర్‌ పోస్టుల నియామకంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాలుగురోడ్ల కూడలిలో రాస్తారోకో నిర్వహించి మావనహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు పి.శాసి్త్రబాబు, వి.సుభాష్‌, వైకుంఠరావు, నరసింగరావుపడాల్‌లు మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించి అంగన్‌వాడీ లింక్‌ వర్కర్ల పోస్టుల నియామకంలో 15 పంచాయతీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ పీవోలకు పిర్యాదుచేశామన్నారు. లింక్‌ వర్కర్లు పోస్టుల ఇప్పిస్తామని అక్రమ వసూల్లకు పాల్పడిన వైసీపీ నాయకులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే ఈ నియమాకాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు నిర్వహించి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాధితులు పాల్గొన్నారు.