Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:59AM

పోరుబాట


(ఆంధ్రజ్యోతి, నల్లగొండ) తెలంగాణ ప్రభుత్వానికి వంద రోజుల పాలన పూర్తి కావటం, ఏ రంగంలోనూ ప్రగతి కనిపించక పోవటంతో విపక్షాలు పోరు బాట పడుతున్నాయి. ప్రధానంగా జిల్లాకు సంబంధించి డిండి ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పెట్టాలన్న నిర్ణయంతో దేవరకొండ డివిజన్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాకు సంబంధించి ఏ ఒక్క హామీ అధికారికంగా ఆచరణకు నోచుకోకపోవటం, ఫ్లోరైడ్‌ వంటి కీలక సమస్యపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట మాట్లాడకపోవటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం మూడు నెలల పాలనను పూర్తి చేసుకోవటంతో ఇక స్వరం వినిపించాలని విపక్షాలు నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ పోరాటం ప్రారంభించింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఐక్య విద్యార్థి సంఘాలు తాజాగా బంద్‌కు పిలుపుని వ్వగా అది విజయవంతమైంది. పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ నిధు లు మంజూరు చేయాలని కలెక్టరేట్‌ ఎదుట భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) గురు వారం భారీ ధర్నా నిర్వహించింది. సమస్యల తో బాధ పడుతున్న విద్యార్థులు తీవ్రతను తెలియజేసేందుకు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు లాఠీని ఝళిపించటం... విద్యార్థులు రాళ్లు రువ్వటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా
విద్యుత్‌ కోతలు, ఎండుతున్న పంటలు, రుణ మాఫీ పేరిట రైతులపై మానసిక ఒత్తిడులను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరగనుంది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాలో అంతే దీటుగా నిరసనలకు సిద్ధమవటం గమనార్హం. రైతులను వేధిస్తున్న సమస్యలను ప్రధానంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై నిలదీ యాలని నిర్ణయించింది. వంద రోజుల పాలన పూర్తైనా ఏ ఒక్క హామీ ఆచరణకు నోచుకోక పోవటాన్ని కాంగ్రెస్‌ దిగ్గజాలు శుక్రవారం ధర్నాలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి సమ న్వయం చేస్తున్న ఈ కార్యక్రమానికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ కార్యదర్శి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కాంగ్రెస్‌ అనుబంధ విభాగాల అధ్యక్షులు ధర్నాకు హాజరు కానున్నారు.