desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:58AM

వివాదాస్పదంగా మారిన పాఠశాల భవనం కూల్చివేత


కూడేరు : మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో పాఠశాల భవన నిర్మాణం వివాదాస్పదంగా మారింది. టీడీపీ, వైఎస్‌ఆర్‌ పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. పాత పాఠశాల భవనాన్ని కూల్చివేసేందుకు గురువారం ఎంపీడీఓ నరసింహారెడ్డి బ్రాహ్మణపల్లిలో టెం డర్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశం రెండువర్గాల మధ్య వాగ్వాదాలకు దారితీసింది. ఓ దశలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ. 6.5 లక్షలు మంజూరు చేసింది. స్థానిక సర్పంచ్‌కు తెలియకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూల్‌ కమిటీ వారికి పనులు అప్పగించడం, భవనం పడగొట్టే సమయంలో స్థానిక సర్పంచ్‌ విషయం తెలుసుకొని అక్కడికెళ్ళి ప్రశ్నించగా ఓ వ ర్గం వారు దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కూల్చివేత పను లు నిలిపిన అధికారు లు తిరిగి టెండర్లను పి లిచేందుకు సన్నాహాలు చేశారు. సర్పంచ్‌కు తె లియకుండా, తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని సర్పంచ్‌ సుం కమ్మ అధికారులను నిలదీశారు. ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తారని ఆమె మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై ఆరా తీశారు. ఇరువర్గాలను స్టేషన్‌కు రప్పించి వివరాలను సేకరించారు. ఞ్ఛౌఞజ్ఛూథోనిుఽఫ్ఖఛ