Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:54AM

గ్రానైట్‌ వాహనాల వల్ల దెబ్బతింటున్న రోడ్లు


ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌ సిటీ: భూగర్భ గనుల శాఖ, ఆర్టీఏ అఽధికారుల తప్పిదాల వల్లనే జిల్లాలో రహదారులు దెబ్బతింటున్నాయని జడ్పీ స్థాయీ సంఘ సభ్యులు మండిపడ్డారు. గురువారం జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ అధ్యక్షతన పనుల స్థాయీ సంఘ సమావేశం వాడివేడిగా జరిగింది. జిల్లాలో గ నులు భూగర్భ శాఖాధికారులు అడ్డదిడ్డంగా గ్రానైట్‌ క్వారీలకు అనుమతులను ఇస్తున్నారని, క్వారీ యజ మానులు అనుమతులకు మించి గ్రానైట్‌ను తరలిం చుకుపోతున్నారని జడ్పీటీసీ సభ్యులు పొద్దుటూరి సంజీవరెడ్డి, లచ్చిరెడ్డి వాపోయారు. ఓవర్‌లోడ్‌తో బీటి రహదారులు సర్వ నాశనం అయిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లను తరలించడం వల్ల జిల్లాకు వచ్చే ఆదాయమేమి లేదని, కోట్ల రూ పాయల విలువైన రోడ్లు నాశనం అవుతున్నాయన్ఞి అన్నారు. వేములవాడ రహదారిలో శాభాష్‌పల్లి రొ డ్డం పూర్తిగా కుంగిపోయిందని, అది ఎప్పుడు కూలి పోయి ఎంతమందికి ప్రమాదం వాటిల్లుతుందో తెలి యని పరిస్థితి నెలకొందని జడ్పీటీసీలు తోట ఆగ య్య, లచ్చిరెడ్డి వాపోయారు.
శంకరపట్నం మండలం సింగాపూర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి ఆముదాలపల్లికి వెళ్లే రహదారి గుంతల మయమైందని ఆ జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక మొలంగూర్‌ ఖిల్లా చుట్టూ ఉన్న గుట్టలను గ్రానైట్‌కు లీజుకు ఇవ్వడం వల్ల ఖిల్లాలోని కోటకు ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఖిల్లా కిందగల కోటను ఆనుకొని ఉన్న కా రీలు బ్లాస్టింగ్‌లు చేపడుతుండడంతో కోట పగుళ్లు బారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రక ఖిల్లాను కాపాడాలని కోరారు. ఈ అంశాలపై ఏడీ మాట్లా డుతూ అవకతవకలపై చర్యలు తీసుకుంటామని, చారిత్రక గుట్టలకు అనుమతులు ఇవ్వమని పేర్కొ న్నారు. ఆర్టీఏ అధికారి మాట్లాడుతూ ఓవర్‌ లోడ్‌ వెళ్ళే లారీలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇ చ్చారు. రాళ్లవాగు ప్రాజెక్టు పనులను మధ్యలో నే ఎందుకు నిలిపివేశారని జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ ఆ శాఖాధికారులను ప్రశ్నించారు. ఎస్సారెస్పీ కా లువలకు, గొలుసుకట్టు చెరువులకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని సభ్యులు కోరారు. అలాగే జి ల్లా పరిషత్‌ వచ్చిన సీనరేజ్‌ గ్రాంట్‌ కింద ప్రతి పాదించిన 36లక్షల 50వేల పనులపై సభ్యులు ఆ మోదం తెలుపలేదు. సమావేశంలో జడ్పీటీసీ స భ్యులు సదాశివరెడ్డి, బిల్ల వెంకట్‌ రెడ్డి, లచ్చిరెడ్డి, తన్నీరు శరత్‌రావు, ఎడ్ల శ్రీనివాస్‌, వీర్ల కవిత, తోట ఆగయ్య, హసీనాబాను, శ్రీకాంత్‌, జడ్పీ సీఈవో వి సదానందం, అధికారులు పాల్గొన్నారు.
మహిళలపై దాడులను నిరోధించాలి..
జిల్లాలో మహిళలు, బాలికలపై జరుగుతున్న దా డులను, హింసను నిరోధించాలని సభ్యులు తీర్మానిం చారు. గురువారం ఉదయం మహిళా సంక్షేమ స్థా యీ సంఘ సమావేశం చైర్మన్‌ రామగుండం జడ్పీ టీసీ గుడికందుల సంధ్యారాణి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మహిళ లు, బాలికలపై జరుగుతున్న లైంగిక, వరకట్న వేఽధింపులను అరికట్టడంలో ఆయా శాఖాధికారులు చోద్యం చూస్తున్నారని అభిప్రాయప డ్డారు. వీటిని నివారించేందుకు ప్రతి మండలంలో ఒక మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని తీ ర్మానించారు. విద్యాసంస్థల వద్ద బాలికలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని సత్వరమే నివారించాల న్నారు. అంగన్‌వాడి కేంద్రాలకు పిల్లలు వచ్చే విధం గా సమీపంలోని ప్రైవేట్‌ పాఠశాలలను తొలగించే ప్రయత్నం చేయాలని తీర్మానించారు. సమావేశంలో జడ్పీటీసీలు శోభారాణి, ఉల్లెంగుల పద్మ, గోపి మాధవి, పాల్గొన్నారు.