Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:53AM

ఈ వంతెనలపై ప్రయాణం ప్రమాదం..

మొగల్తూరు: మండలంలోని పలు వంతెనలపై రెయిలింగ్‌ కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనలకు ఇరు పక్కలా రెయిలింగ్‌ కుప్పకూలడంతో అకస్మాత్తుగా అదుపుతప్పే వాహనాలు వంతెనల కింద కాలువల్లోను, ఉప్పుటేరుల్లో పడే అవకాశం ఉంది. రాత్రి సమయాల్లో ఇలాంటి వంతెనలపై ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. మండలంలోని కాళీపట్నంలో జిఎన్‌వి కెనాల్‌పై వంతెనకు, జగన్నాధపురం పంచాయతీ మచ్చగడ వెళ్ళే వంతెన, మొగల్తూరులోని ఉచ్చింత కాలువ వంతెనలపై రెయిలింగ్‌లు కూలిపోయాయి. అలాగే ముత్యాలపల్లి బ్రిడ్జిపై జాయింట్‌లు గోతులుగా మారడంతో ఆటోవాలాలు, మోటార్‌ సైకిలిస్ట్‌లు ప్రమాదాల బారిన పడుతున్నారు. మొగల్తూరులోని జాతీయ రహదారి వెంబడి రామాలయం సెంటర్‌లో పెద్దగొయ్యి పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు గొయ్యిపెద్దదవ్వడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాలు తప్పించబోయి పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.