Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:52AM

చేనేత కార్మికుల రుణమాఫీ ప్రతిపాదనలు

రూ. 59.49 లక్షలు అక్టోబర్‌ 2 నుంచి చేనేత కార్మికులకు వెయ్యి పింఛన్‌
ఈ ఏడాది 614 మందికి రుణాలు అందిస్తాం
చేనేత జౌళి శాఖ ఏడీ పవన్‌కుమార్‌

పెంటపాడు : జిల్లాలో చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.54.49 లక్షల ప్రతిపాదనలు పంపించామని జిల్లా చేనేత, జౌళీ శాఖ సహాయ సంచాలకులు దానగళ్ళ పవన్‌కుమార్‌ తెలిపారు. పెంటపాడు మండలం రామచంద్రపురం చేనేత సొసైటీలో గురువారం మహాత్మగాంధీ బున్‌కర్‌ బీమా యోజన పథకంలో భాగంగా 9 నుంచి12వ తరగతి వరకు చదువుతున్న చేనేత కార్మికుల పిల్లలు 20 మందికి ఉపకార వేతనాల చెక్కులను అందజేశారు.అనంతరం ఆయన మా ట్లాడుతూ రుణమాఫీ కోసం 166 మంది చేనేత కార్మికులకు వ్యక్తి గత రుణాలు రూ. 37,34,598లు , 4 గ్రూపులకు రూ. 3,83,639, చేనేత సొసైటీలకు రూ.13,31,214లు ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లాలో 22 చేనేత సహకార సంఘాల్లో 6,955 మంది కార్మికులు ఉన్నారని తెలిపారు. అయితే వీరిలో మహాత్మ గాంధీ బునకర్‌ బీమాయోజన పఽథకంలో 3071 మంది లబ్ధిదారులుగా ఉన్నారని తెలిపా రు. 50 ఏళ్ళు దాటిన 3 వేల మందికి పైగా చేనేత కార్మికులకు అక్టోబర్‌ 2 నుంచి రూ. 1000లు పింఛన్లు అందిస్తారన్నారు. 2013 -14 సంవత్సరానికి గాను 800 మందికి వీవర్స్‌ క్రెడిట్‌ కార్డులు అం దించాలనే లక్ష్యంకాగా ఇందులో 186 మందికి కార్డులు అందజేసి రూ 45.75 లక్షల రుణాలు అందించామన్నారు. మిగిలిన 614 మందికి కూడా 2014-15 సంవత్సరంలో రుణాలు అందించేందుకు బ్యాంక్‌ అధికారులతో మాట్లాడామన్నారు. అంత్యోదయ అన్న యోజన పఽథకానికి ధరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు వాసా గణపతి, కార్యదర్శి నాగేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.