desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:27AM

రోడ్లకు మోక్షం


(పాలకొండ)
జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహ దారులకు మహర్దశ పట్టనుంది. ఆర్‌అండ్‌బీ రహదారులకు వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఈ ఏడాదికి రూ.3.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో 2,215 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారుల్లో పాడైన రోడ్లను మెరుగుప రిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు.
కొన్నేళ్లుగా ఆర్‌అండ్‌బీ రహదారులు గోతులమయమై అధ్వానంగా తయారయ్యాయి. ఆయా రహదారులపై ప్రయాణం నరకయాతనగా మారింది. వాహనాలు సైతం మర మ్మతులకు గురి అవుతుండడంతో పాటు రాత్రి సమయాల్లో ప్రయాణం ప్రాణ సంకట ంగా మారుతున్నది. ఈ ఏడాది జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. దీంతో పలు ఆర్‌ అండ్‌బీ రహదారులు చిధ్రమయ్యాయి. మరికొన్ని రహదారులు వరదనీటికి కోతకు గుర య్యాయి. ఈ తరుణంలో రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు కావడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2215 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆర్‌అండ్‌బీ రహదారుల్లో చాలా రోడ్లు గోతులతో అధ్వానంగా తయారయ్యాయి. సు మారు 1000 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నా యి.
ఈ రహదారులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా కొన్ని రహ దారులకు పదేళ్లు దాటినా కనీస మర మ్మతులు చేపట్టడంలేదు. ఈ కోవలోనే కల్వ ర్టులు, వంతెనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మంజూరైన కొద్దిపాటి నిధులతో అను కు న్నస్థాయిలో మరమ్మతులు పూర్తికావని సంబంధితశాఖాధికారులు పేర్కొంటు న్నారు. మరిన్ని నిధులు మంజూరైతే గాని రహ దారులను మెరుగయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. కాగా ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3.50 కోట్లుతో బెర్మ్‌ల ఏర్పాటు, జంగిల్‌ క్లియరెన్స్‌, రహదారుల ప్యాచ్‌ వర్క్‌ లు, భారీ వర్షాలకు కోతకు గురైన రహ దారులను బాగు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.