desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:27AM

షాక్‌


టెక్కలి : రెండో విడత కౌ న్సెలింగ్‌ కోసం ఎదురుచూ స్తున్న ఇంజనీరింగ్‌ విద్యార్థుల కు సుప్రీంకోర్టు ఝలక్‌ ఇచ్చిం ది. ప్రతి ఏడాది జరిగే రెండు, మూడు విడతల కౌన్సిలింగ్‌ ఈ సారి ఉండదంటూ, ఒకే విడ త కౌన్సిలింగ్‌తో సరని గురు వారం జస్టిస్‌ ముఖోపాధ్యా య ఆధ్వర్యంలో సుప్రీంకో ర్టు డివిజన్‌బెంచ్‌ తీర్పు చె ప్పింది. దీంతో ఇంజనీరింగ్‌ వి ద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి.జిల్లాలో ప్రధానంగా జీఎంఆర్‌, ఆదిత్య వంటి ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే శతశాతానికి దగ్గరగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఆప్షన్లు ఎంచుకున్నప్పటికీ వారిలో కొందరు విద్యార్థులు రెండోవిడతలో బ్రాంచ్‌ల మార్పులకు, మరో కళాశాలలో చేరేందుకు చూస్తున్నారు. వారి ఆశలకు సుప్రీంకోర్టు తీర్పు బ్రేకు వేసినట్లయింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. కోర్టు తోసిపుచ్చడంతో చాలామంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తాజా తీర్పు తో జిల్లాలోని 300 నుంచి 400 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు కావాల్సిన కళాశాలలు, బ్రాంచ్‌లు ఎంచుకునేందుకు రెండో విడత అవకాశం లేకుండా చేయడంతో వారంతా అగమ్యగోచరంలో పడ్డారు. కాగా రెండోవిడత కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు.