Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:27AM

సమాచారంతో సిద్ధం కండి


(టెక్కలి/ నరసన్నపేట)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17, 18 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేప థ్యంలో ఆయా శాఖల అధికారులు పూర్తి వివ రాలతో సిద్ధంగా ఉండాలని సీఎం ప్రత్యేక కా ర్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశా రు. సీఎం పర్యటనలో భాగంగా జిల్లాలో పర్యా టక కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పురాతన, ప్రసిద్ధి గాంచిన దేవాలయా లు, కట్టడాలు గుర్తించి వాటి వివరాలు సేకరించాలని కోరారు. మురికివాడలు, గ్రామీణ ప్రాం తాల్లో చంద్రబాబు పర్యటన సాగేలా ప్రణాళిక తయారు
చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రకటనలు చేసే అవకాశం ఉం దని, ఏ వివరాలు అడిగినా చెప్పేలా ఉండా లన్నారు. జిల్లాకు చెందిన అన్ని వనరులు, అభివృద్ధి కార్యక్రమాలతో ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, సన్న, చిన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు, ఎన్‌ ఆర్‌ఈజీఎస్‌ వేతనదారులతో సమావేశాలు ని ర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సీ ఎం రెండోరోజుస్వయంశక్తి సంఘాలతో స మావేశమవుతారని, జిల్లా అధికారులతో స మీక్షలకు అవసరమయ్యే షామియానా, లౌడ్‌ీ స్పకర్స్‌, లైటింగ్‌ ఏర్పాట్లుచేసుకోవాలని సీ ఎం ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్‌ అధికారుల కు ఆదేశించారు.
అధికారుల్లో హడావిడి: జిల్లాకు సీఎం రానున్న నేపథ్యంలో ఆయా శాఖల అధి కా రులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కా రంపై దృష్టి సారించారు. ఇప్పటికే మండల ప్రజా పరిషత్‌లో గత ఏడాది ఆగస్టు 14 నుంచి ఈ నెల 6 వరకు వచ్చిన ఫిర్యాదులు, పరి ష్కా రమైనవి, తిరస్కరించినవి, పెండింగ్‌లో ఉన్న వివరాలను జడ్పీ సీఈవో సేకరిస్తున్నారు.
ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి: కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గు రువారం సాయంత్రం తామరాపల్లి, నరసన్నపేట జూనియర్‌ కాలేజీ మైదానాన్ని పరిశీలించారు. తామరాపల్లి వద్ద హెలీప్యాడ్‌ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. నరసన్నపేటకు నాలుగు వైపుల బస్సుల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఖాన్‌ మంత్రికి చెప్పారు. దీనిపై జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌, ఎస్పీ ఏఎస్‌ ఖనా్‌లతో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట కలెక్టర్‌ ఉప్పల్‌గౌరవ్‌, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, బలగ నాగేశ్వరరావు ఉన్నారు.
ముఖ్యమంత్రి టూర్‌ షెడ్యూల్‌
17న ఉదయం 10 గంటలకు విశాఖపట్నం నుంచి తామరాపల్లి చేరుకుంటారు. ప్రజలతో ముఖాముఖీ చర్చించనున్నారు. అనంతరం నరసన్నపేట జూనియర్‌ కాలేజీ మైదానంలో వ్యవసాయ, దాని అనుబంధశాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించి, రైతు సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం రోడ్డు మార్గంలో కోమర్తి జంక్షన్‌, దేవాది వద్ద ప్రజలతో ముచ్చటిస్తారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం సింగుపురంలో ప్రజలతో మాట్లాడి శ్రీకాకుళం చేరుకుంటారు. అదే రోజు మున్సిపల్‌ మైదానంలో పార్టీ సమావేశం నిర్వహిస్తారు. రాత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో బసచేస్తారు. 18న అరసవల్లిలో డీసీఎంఎస్‌ గిడ్డంగులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పైడిభీమవరం చేరుకొని ఓ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. మహిళా సదస్సులో పాల్గొంటారు.