Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:20AM

గుట్టుగా గుట్కా వ్యాపారం


గుండాల: గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్న గుట్కాల ధరలు మండుతున్నాయి. గుట్కాలు తింటే గుండె దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరికలు చేస్తుండగా, నిషేధం మాటున అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులు, వినియోగ దారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా నుంచి కొందరు దళారులు గుండాలకు దిగుమతి చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. నిషేధానికి ముందు మార్కెట్లో రూపాయికి లభ్యమైన గుట్కా ప్యాకెట్‌, ప్రస్తుతం అదే ప్యాకెట్‌ రూ:5కి అమ్ముతున్నారు. నిషేధం మాటున నిలువు దోపిడి చేస్తున్న వ్యాపారులపై పోలీసులు దృష్టి పెట్టక పోవడంతో, గుట్కాల ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిషేదం ఉందన్న కారణం చూపుతున్న వ్యాపారులు, యదేచ్ఛగానే అమ్మకాలు సాగిస్తున్నారు. గుండాలకు చెందిన కొందరు గుట్కాల వ్యాపాౄరాన్ని ఎంచుకుని, మండలంలోని ఇతర గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. మండలంలోని మర్కోడు, ఆళ్లపల్లి, ఇల్లందు మండలంలోని పోలవరం, కొమరారం గ్రామాలకు ఎగుమతి చేస్తున్నారు. దండిగా లభాలు వస్తుండడంతో, దళారీ వ్యాపారులు పోటీలు పడి గుట్కాలను అత్యంత రహస్యంగా గుండాలకు దిగుమతి చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా జోరుగా సాగుతున్న గుట్కాల వ్యాపారంపై పోలీసులు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జడో్‌ఠఛ-77 వర,ఃూ