desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:04AM

దేవాదాయ శాఖలో అవినీతి అధికారులపై విచారణ జరిపించాలి : తెలంగాణ అర్చక సమాఖ్య


బర్కత్‌పుర/హైదరాబాద్‌: దేవాదాయ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ఏసీబీచే విచారణ జరిపించాలని తెలంగాణ అర్చక సమాఖ్య డిమాండ్‌ చేసింది. అవినీతి అధికారులను తక్షణమే బదిలీ చేయాలని సమాఖ్య నేతలు కోరారు. బర్కత్‌పురలోని అర్చక సంక్షేమ భవన్‌లో గురువారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, గౌరవాధ్యక్షుడు భాస్కరభట్లరామశర్మ, దేవాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి సంజీవరావు మాట్లాడుతూ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ అధికారులకు అడిషనల్‌ కమిషనర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. దేవాదాయ శాఖకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమించాలని వారు డిమాండ్‌ చేశారు. మెదక్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు అర్చక సమాఖ్య నేతలు వెల్లడించారు. 3,150 దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా దేవాలయాలలో పూజలు నిర్వహించాలని సమాఖ్య నేతలు తెలిపారు