Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:04AM

కేంద్ర బకాయిలు మాఫీ చేయండి


 14వ ఆర్ధిక సంఘాన్ని కోరనున్న తెలంగాణ సర్కారు
ఈ నెల 15 తర్వాత తెలంగాణకు ఆర్థిక సంఘం రాక

(హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి): కేంద్ర బకాయిలు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం 14వ ఆర్ధిక సంఘాన్ని కోరాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో బకాయిలను రద్దు చేస్తేనే రాష్ట్రానికి కొత్తగా రుణాలు లభించే పరిస్థితి ఉందని భావిస్తున్న తెలంగాణ సర్కారు, ఈ మేరకు ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున నిధులు అవసరమవుతున్న దృష్ట్యా కూడా బకాయిలను మాఫీ చేయాల్సిందేనని వాదిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాదాపు రూ. 13 వేల కోట్లవరకు కేంద్రానికి బకాయి పడింది. ఇందులో 42 శాతం తెలంగాణ వాటా కింద తెలంగాణ రూ. 5640 కోట్ల మేరకు బకాయిలు బదిలీ అయ్యాయి. గతంలో పలు పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం 70 శాతం వరకు రుణ ం కింద నిధులను అందించేది. ఆ రుణాలను రద్దు చేయడమో లేదా వడ్డీని మాఫీ చేయాలనో రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పథకాల అమలుకు నేరుగా రుణాలివ్వడాన్ని కేంద్రం నిలిపివేసింది. ప్రస్తుతం 10 నుంచి 15 శాతం మధ్య మాత్రమే రుణాలను ఇస్తోంది. ఇదిలా ఉంటే, ఈ నెల 19 లేదా 20 తేదీల్లో 14వ ఆర్ధిక సంఘం తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నెల 15-20 తేదీల మధ్య ఎప్పుడైనా ఆర్ధిక సంఘం రావ చ్చని సీఎం కేసీఆర్‌ సూచించారు. అదే విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆర్ధిక సంఘం కార్యాలయానికి నివేదించింది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ఆర్థిక సంఘం రాష్ట్రానికి వ చ్చే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్ధిక సంఘంతో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు సమావేశమై తెలంగాణ అవసరాలను వివరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేంద్ర గ్రాంట్లను ఎక్కువగా ఇవ్వాలని, కేంద్ర పన్నుల్లో వాటాను 32 శాతం నుంచి కనీసం 40 శాతం వరకైనా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. దఠ’(
్క