Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:03AM

ప్రలోభాలు షురూ


బూత్‌ల వారీగా డబ్బు పంపిణీ
మద్యం ప్రవాహానికి అన్ని పార్టీల్లో ఏర్పాట్లు
 ప్రచారం ముగియడంతో ఊపిరి పీల్చుకున్న నాయకులు
సంగారెడ్డి/ సిద్దిపేట: మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం ముగియడంతో ప్రలోభాల పర్వానికి తెర లేచింది. ప్రధాన పార్టీల్లో ఇతర జిల్లాల నాయకుల పెత్తనం ముగియడంతో స్థానిక నేతలు రంగంలోకి దిగారు. గడిచిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే, ఈ ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరుగుతున్న తతంగం చాలా తక్కువ అని ప్రధాన పార్టీల నాయకుల సమాచారం. నాలుగు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గజ్వేల్‌ శాసనసభ, మెదక్‌ లోకసభ స్థానాల నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుత ఉప ఎన్నికలో 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా, పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే నెలకొన్నది. ఈ నెల 13న
నిర్వహించే ఓటింగ్‌లో 15,43,075 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం ఎన్నికల అధికారులు 1,817 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,086 మంది పోలింగ్‌ విధులను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల వారు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అధి ష్ఠానం నియోజకవర్గానికి ఒక మంత్రిని, మండలానికో ఎమ్మెల్యేను, వార్డు లేదా గ్రామానికి ఒక ఎంపీపీ స్థాయి నాయకుడిని చొప్పున ఇతర జిల్లాల నుంచి నేతలను రప్పించింది. వారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం నియోజకవర్గం, మండల కేంద్రాలకే పరిమితమై ఇతర జిల్లాల నాయకులను ఇన్‌చార్జీలుగా నియమించింది. టీడీపీ- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు సమష్టిగా లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లు, మండలాల్లో ఇతర జిల్లాల నేతలతో ప్రచారపర్వాన్ని ముగించారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియగానే, ఇతర జిల్లాల నాయకులు ఈ లోక్‌సభ నియోజకవర్గాన్ని వదిలివెళ్లారు. ఏదైనా ఎన్నికల ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేయడం సాధారణం. ఉప ఎన్నికలో అది మరింత అధికంగా జరుగుతుండేది. ఈసారి అంత హంగామా కనిపించడంలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపు రాచబాట కావడంతో మెజార్టీ సాధనను వారు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు కులాలు, సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించారు. పోలింగ్‌ బూత్‌ల