Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:01AM

భూదాన్‌ బోర్డు భూముల వ్యవహారంలో అక్రమాలు లేవు.. అన్నీ అపోహలే


 భూదాన్‌బోర్డు చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబర్‌ 11 : భూదాన్‌ బోర్డు భూముల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కొంతమంది సీఎం కేసీఆర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని, తను ఈ విషయంపై కేసీఆర్‌కు స్పష్టమైన సమాచారం ఇచ్చినట్లు భూదాన్‌బోర్డు చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఆచార్య వినోబా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన హయాంలో అన్యాక్రాంతమైన 10 వేల ఎకరాల భూములను యజ్ఙ బోర్డు స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆ భూములను చట్టబద్ధం చేశామని, తనపై కొందరు సీఎంకు తప్పుడు సమాచారం ఇచ్చారని, త్వరలోనే అపోహలు తొలగిపోతాయని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు భూదాన బోర్డుకు సంబంధించిన భూముల వివరాలపై 2000-2014కు సంబంధించిన అడ్మినిసే్ట్రటివ్‌ నివేదికను సమర్పించినట్లు రాజేందర్‌రెడ్డి తెలిపారు.వని పేస్‌ అన్నాడుకఝజూ