Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:00AM

ప్రత్యేక ప్రణాళిక ద్వారా ‘బొమ్మలమ్మ’ అభివృద్ధి


 రాష్ట్ర భూగర్భ గనులశాఖ ఓఎస్‌డీ దేశ్‌పాండే వెల్లడి
 ఆంధ్రజ్యోతి కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందన

గంగాధర, సెప్టెంబర్‌ 11 : కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బొమ్మలమ్మ గుట్ట అభివృద్ధికి యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని ఓఎస్‌డీ దేశ్‌పాండే అన్నారు. గంగాధర మండలం కురిక్యాల, కొండన్నపల్లి గ్రామాల బొమ్మలమ్మ గుట్టను గురువారం దేశ్‌పాండేతోపాటు మైనింగ్‌, పురావస్తుశాఖ అధికారులు, కవులు, రచయితలు, చరిత్రకారులు సందర్శించారు. ఆంధ్రజ్యోతిలో ఈ నెల 7న ‘బొమ్మలమ్మ గుట్ట..చట్టబండలు’ శీర్షికన ప్రచురితమైన వార్తా కథనానికి మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఈ మేరకు ఆయన బొమ్మలమ్మ గుట్ట అభివృద్ధికి అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి ఓఎస్‌డీ దేశ్‌పాండేను, పురావస్తు, మైనింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో శ్రీధర్‌ దేశ్‌పాండే, మైనింగ్‌శాఖ ఏడీ క్రిష్ణప్రతాప్‌ తదితరులు గుట్టను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా దేశ్‌పాండే విలేకరులతో మాట్లాడుతూ గుట్ట పరిరక్షణ బాధ్యతతో పాటు దానిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచాలని హరీశ్‌రావు ఆదేశించినట్లు వెల్లడించారు. దీనికోసం గుట్టను ఆనుకుని మరో 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి... బొమ్మలమ్మ గుట్టను పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.