Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 01:00AM

కేసీఆర్‌పై 14న ధర్మ యుద్ధంకేసీఆర్‌పై 14న ధర్మ యుద్ధం


 సీఎం కుర్చీని లాక్కునే దాకా ఐక్యపోరాటం: కారెంశివాజీ
 మెడ నరుక్కుంటావా... నరకమంటావా..?
 మాల మహానాడు అధ్యక్షుడు రామ్మూర్తి
 మద్దతివ్వాలని పొన్నాలను కలిసిన నేతలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): మాట త ప్పితే మెడ నరుక్కుంటానని చెబుతున్న కేసీఆర్‌... సీఎం పదవి దళితులకు ఇస్తానని చెప్పి, మాట తప్పినందుకు మెడ నరుక్కోవాలని... లేనిపక్షంలో తామే నరుకుతామని మాలమహానాడు హెచ్చరించింది. దళితులకు చెందిన సీఎం కుర్చీని లాక్కునే దాకా కేసీఆర్‌పై పోరాటం చేస్తామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెంశివాజీ హెచ్చరించారు. కేసీఆర్‌ దొరతనంపై ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌ ధర్మ యుద్ధం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోఆయనవిలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో 1 శాతంగా ఉన్న అగ్రకులాలకు 7 మంత్రి పదవులు ఇచ్చారని, 15 శాతం ఉన్న దళితులకు ఒక మంత్రి పదవి మాత్రమే ఇవ్వడం దారుణమన్నారు. సీఎం పదవిని అడుగుతారన్న ఉద్దేశంతోనే దళితుల మధ్య చిచ్చుపెట్టడానికి వర్గీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. హెల్త్‌ యూనివర్సిటీని తీసుకొస్తానని వరంగల్‌లో ప్రకటించినందుకు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను కించపరిచేలా వ్యాఖ్యానించిన కేసీఆర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా చానెళ్ల ప్రసారాలను నిలుపుదల చేయడం అన్యాయమని, వెంటనే ప్రసారాలను పునరుద్ధరించాలన్నారు. మీడియా స్వేచ్ఛను కూడా ధర్మ యుద్ధంలో చేర్చుతామని తెలిపారు. ధర్మ యుద్ధంలో పాల్గొనాలని అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని, తమ సమస్యలపై, మాలలపై సీఎం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే ధర్మయుద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. దళితులకు సీఎం పదవిపై మాట తప్పిన సీఎం కేసీఆర్‌.. తలను నరుక్కుంటావా.. తమను నరకమంటావా అని తెలంగాణమాల మహానాడు అధ్యక్షుడు రామ్మూర్తి ప్రశ్నించారు. దళితుల దక్కాల్సిన శాఖను కూడా కేసీఆర్‌ తన వద్దే ఉంచుకొని, దళితుల సంక్షేమాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కాగా, తాముచేపట్టిన ధర్మయుద్ధానికి మద్దతు ఇవ్వాలని, ఇందిరా పార్క్‌వద్ద జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆహ్వానించినట్టు శివాజీ తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన పొన్నాల కలిశారు.