Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:58AM

పిస్టోరియస్‌కు ఊరట

 హత్య కేసు నుంచి బయటపడే అవకాశం
ప్రిటోరియా: ప్రియురాలు హత్య కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్‌ రన్నర్‌ ఆస్కార్‌ పిస్టోరియస్‌కు పెద్ద ఊరట లభించింది. పిస్టోరియస్‌ ఉద్దేశపూర్వకంగా ఈ హత్యకు పాల్పడలేదని దక్షిణాఫ్రికా కోర్టు తీర్పుచెప్పింది. దీంతో గాళ్‌ఫ్రెండ్‌ రీవా స్టీన్‌క్యాంప్‌ హత్యకేసులో పారా అథ్లెట్‌ పిస్టోరియస్‌ నిర్దోషిగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘పిస్టోరియస్‌ ఉద్దేశ పూర్వకంగా హత్య చేశాడని నిరూపించడానికి ప్రాసిక్యూషన్‌ ఎటువంటి ఆధారాలూ సమర్పించలేద’ని గురువారమిక్కడ తీర్పు వెలువరించే ముందు హైకోర్టు న్యాయమూర్తి థొకోజైల్‌ మసి పా వ్యాఖ్యానించారు.
బాత్‌రూమ్‌ డోర్‌ వెనుకనున్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపినట్లు తనకైతే అనిపించడం లేదని అన్నా రు. తుది తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. 2013, వాలెంటైన్స్‌ డే రోజు బాత్‌రూమ్‌లో తన ప్రియురాలు రీవాను కాల్చి చంపినట్లు కేసు నమోదైంది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా పారా అథ్లెట్‌ హత్యకు పాల్పడ్డాడని ప్రాసిక్యూషన్‌ చేసిన ఆరోపణను పిస్టోరియన్‌ ఖండించిన సంగతి తెలిసిందే.