
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ లో ముంబై ఇండియన్స్ జట్టుకు విండీస్ స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా టోర్నీకి దూరమైనందున పొలార్డ్‌ను సారథిగా నియమించినట్టు ముంబై గు రువారం ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై శనివారం మొదలయ్యే క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో లాహోర్ లయన్స్‌తో పోటీపడనుంది.
మోర్కెల్, దిల్షాన్ దూరం: చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీకి మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. గాయంతో కోల్‌కాతా నైట్‌రైడర్స్ బౌలర్ మోర్నె మోర్కెల్, వ్యక్తిగత కారణాలతో సదరన్ ఎక్స్‌ప్రెస్ బ్యాట్స్‌మన్ తిలక్‌రత్నె దిల్షాన్ టోర్నీ నుంచి వైదొలిగారు. మోర్కెల్ స్థానంలో మన్విందర్ బిస్లా జట్టులోకి రానున్నాడు.