Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:57AM

నారంగ్‌కు ఒలింపిక్‌ బెర్త్‌ మిస్‌


ప్రపంచ చాంపియన్‌షిప్‌

గ్రెనడా (స్పెయిన్‌): భారత స్టార్‌ షూటర్‌, హైదరాబాదీ గగన్‌ నారంగ్‌ తృటిలో ఒలింపిక్‌ బెర్త్‌ను చేజార్చుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌పిప్‌లో ఒక్కస్థానం వెనుకంజతో అతను రియో ఒలింపిక్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురువారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగం ఫైనల్లో నారంగ్‌ 124.2 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి ఐదుస్థానాల్లో నిలిచిన వారు ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకున్నారు. ఇదే విభాగంలో హరిఓమ్‌ సింగ్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే 45వ స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరుకోలేకపోయాడు. కాగా, 50 మీ పిస్టల్‌ విభాగంలో రజతం సాధించి ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జీతూరాయ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మాత్రం నిరాశ పరిచాడు. పైనల్‌ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ప్రకాశ్‌ నంజప్ప, జీతూ తొమ్మిది, పది స్థానాలతో సంతృప్తి చెందారు.

9