desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:56AM

పఠాన్‌ బ్రదర్స్‌.. క్యాప్‌!


బరోడాలో క్రికెట్‌ అకాడమీ

ముంబై: భారత క్రికెట్‌ సోదరులు యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తమ కలల ప్రాజెక్ట్‌.. క్రికెట్‌ అకాడమీ ఆఫ్‌ పఠాన్స్‌ (క్యాప్‌)ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పఠాన్‌ సోదరుల సొంత పట్టణమైన బరోడాలో వచ్చే నెల నుంచి ఈ అకాడమీలో క్లాసులు మొదలుకానున్నాయి. ఈ అకాడమీ కోచ్‌గా టీమిండియా మాజీ గురు ఇయాన్‌ చాపెల్‌, చీఫ్‌ మెంటర్‌గా కామెరూన్‌ ట్రెడ్‌వెల్‌ వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 50 అకాడమీలు ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని పఠాన్‌ సోదరులు తెలిపారు. ఛి