desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:55AM

మూడెకరాల భూమి ఇవ్వాలి


 అఖిల భారత రైతు కూలీ సంఘం
బాల్కొండ, సెప్టెంబర్‌ 11 : ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ గురువారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో దళితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజమైన దళితులను గుర్తించి, సెంటు భూమిలేని పేదవారికి తక్షణమే భూ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 15న దళిత కుటుంబానికి మూడెకరాల భూమితో పాటు సంవత్సరం సాగు ఖర్చులు భరిస్తామని మంత్రి మండలి తీర్మానించిందని.. కానీ దానిని ఇప్పటికీ అమల్లోకి ఎందుకు తీసుకురాలేరని ప్రశ్నించారు. భూ పంపిణీలో పైరవీలకు తావివ్వకుండా, పేద దళితులందరికీ న్యాయం చేయాలని ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు.ఇ