Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:55AM

భారత్‌కు సవాల్‌..!

సెర్బియాతో పోరుకు రెడీ
 సింగిల్స్‌పైనే ఆశలన్నీ
 నేటి నుంచే డేవిస్‌ కప్‌
మధ్యాహ్నం 3 నుంచి డీడీ స్పోర్ట్స్‌లో
యుకీతో ఆరంభం

బెంగళూరు: డేవిస్‌ కప్‌ పోరులో భారత్‌కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. జొకోవిచ్‌ లాంటి స్టార్లు లేకపోయినా ప్రపంచ నెం 2 జట్టు సెర్బియా నుంచి 23వ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కు గట్టిసవాల్‌ తప్పదు. 2013 డేవిస్‌కప్‌ ఫైనలిస్టు సెర్బియా, భారత్‌ మధ్య ప్రపంచ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు బెంగళూరు కెఎస్‌ఎల్‌టీ టెన్నిస్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. 2011లో డేవిస్‌ కప్‌ మొదటిరౌండ్‌లోనే సెర్బియా 4-1తో భారత్‌ను ఓడించింది. ప్రపంచ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, జంకో తిప్సరెవిచ్‌, విక్టర్‌ ట్రోయ్‌కి లాంటి ఆటగాళ్లు లేకపోయినా.. ఇక్కడి వాతావరణం పర్యాటక జట్టుకు ఇబ్బంది కలిగిస్తున్నా సెర్బియాను తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. సింగిల్స్‌లో ఇరుజట్లకు సమానవకాశాలు ఉండడంతో.. డబుల్స్‌ మ్యాచ్‌ కీలకం కానుంది.
డ్రా ప్రకారం యుకీ భాంబ్రీ మొదటి సింగిల్స్‌లో బరిలోకి దిగనున్నాడు. చెన్నై చాలెంజర్‌ గెలుచుకుని ఈ సీజన్‌ శుభారంభం చేసిన భాంబ్రీ.. తర్వాత కాలి గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్నాడు. జూలైలో మళ్లీ రాకెట్‌ పట్టిన యుకీకి సొంతగడ్డపై ఆడుతుండడం కలిసొచ్చే అంశం. సెర్బియా జట్టుకు సింగిల్స్‌లో నేతృత్వం వహిస్తున్న డూసన్‌ లజోవిచ్‌ ప్రస్తుత విజయాల రికార్డు మెరుగ్గానే ఉంది. రెండో సింగిల్స్‌లో భారత ప్రధాన ఆటగాడు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ బరిలోకి దిగనున్నాడు. గత ఆరునెలల నుంచి ఏటీపీ సర్క్యూట్‌లో మొదటి, రెండో రౌండ్‌లు దాటడానికే తంటాలుపడుతున్నాడు. భారత్‌ ప్రధానంగా టార్గెట్‌ చేయాల్సిన సింగిల్స్‌ ఆటగాడు ఫిలిప్‌ క్రజినోవిచ్‌. సోమ్‌దేవ్‌, యుకీలు క్రజినోవిచ్‌పై విజయం సాధిస్తే.. భారత్‌ మళ్లీ వరల్డ్‌ గ్రూప్‌లోకి ప్రవేశించే అవకాశాలు మెరుగవుతాయి. డబుల్స్‌లో లియాండర్‌ పేస్‌-రోహన్‌ బోప న్న జోడీ.. సెర్బియా ద్వయం నెనాడ్‌ జిమోంజిచ్‌-లిజా బొజోల్‌జాచ్‌తో తలపడనుంది. కీలకమైన డబుల్స్‌ మ్యాచ్‌లో పేస్‌-బోపన్న జోడీ ఆటతీరుపైనే భారత విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. సాకేత్‌ మైనేని కూడా జట్టులో ఉంటే.. భారత అవకాశాలు మరింత మెరుగుపడేవని పేస్‌ అన్నాడు. గతంలో జిమోన్‌జిచ్‌, పేస్‌లు కలసి డబుల్స్‌ ఆడారు. ఒకరి ఆటగురించి మరొకరికి అవగాహన ఉంది.
సింగిల్స్‌లోనే చాన్స్‌: భారత జట్టు గెలుపునకు సింగిల్స్‌ ప్రదర్శన కీలకమని దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు విజయ్‌ అమృతరాజ్‌ అభిప్రాయపడ్డాడు. ‘డేవిస్‌ కప్‌లో భారత విజయం.. సింగిల్స్‌ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. నాలుగు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో తొలి రెండింటిలో నెగ్గడం కీలకం. అయితే డబుల్స్‌ను నమ్ముకుంటే 1-4తో ఓడడం ఖాయమ’ని అమృతరాజ్‌ అన్నాడు. ఇక తొలి సింగిల్స్‌లో యుకీ భాంబ్రీకి బదులు సోమ్‌దేవ్‌ను ఆడించాలని సూచించాడు.
డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ టై మొదటి సింగిల్స్‌లో యుకీ భాంబ్రీ, సెర్బియా నెంబర్‌ 2 ఆటగాడు డూసన్‌ లజోవిచ్‌తో తలపడనున్నాడు. శుక్రవారం ప్రారంభం మొదలయ్యే ఈ పోరు రెండో సింగిల్స్‌లో సోమ్‌దేవ్‌, క్రజినోవిచ్‌తో పోరాటానికి సిద్ధమయ్యాడు. మొదటి సింగిల్స్‌ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుండగా, రెండో సింగిల్స్‌ సాయం త్రం 6.30 గంటలకు మొదలుకానుంది. రెండో రోజు.. అంటే 13వ తేదీ డబుల్స్‌లో పేస్‌-బోపన్న జోడీ.. నెనాడ్‌ జిమోన్‌జిక్‌-లిజా బొజోల్‌జాక్‌ జోడీతో అమీతుమీ తేల్చుకోనుంది.
చివరి రోజు.. అంటే 14వ తేదీ రివర్స్‌ సింగిల్స్‌లో సోమ్‌దేవ్‌- లజోవిచ్‌తో ఆడనుండగా.. రెండో మ్యాచ్‌లో బాంబ్రీ, క్రజినోవిచ్‌తో పోరాడనున్నాడు. ఆట ఆరంభానికి గంట ముందు డబుల్స్‌, రివర్స్‌ సింగిల్స్‌ ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉందని భారత కెప్టెన్‌ ఆనంద్‌ అమృతరాజ్‌ బుధవారమిక్కడ చెప్పాడు. యుకీ శుభారంభం అందించగలడని అన్నాడు.
ంచగజీ’4ె థ