Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:48AM

వచ్చే ఏడాది విశాఖలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సు

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
ఎన్‌ఏడీ జంక్షన్‌/పెం దుర్తి (విశాఖపట్నం), సెప్టెంబర్‌ 11: గ్లోబల్‌ హిందూ ఫౌండేషన్‌ సౌజన్యంతో వచ్చే ఏడాది విశాఖలో అంతర్జాతీయ ఆ ధ్యాత్మిక సదస్సు నిర్వహించనున్నట్టు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. శారదాపీఠం వేదికగా జరుగుతుందన్నారు.గంగా నదీతీరాన చాతుర్మాస దీక్ష ముగించుకున్న స్వామిజీ గురువారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ ఈ ఏడాది చాతుర్మాసం వైభవంగా జరిగిందన్నారు. సాధుసంతులకు రుషీకేశ్‌లోని శారదా పీఠం ద్వారా భోజనాలు, వస్ర్తాలను అందజేశామన్నారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాలను అరికట్టేందుకు శిష్యులను వినియోగిస్తామన్నారు. చార్‌ధామ్‌ బాధితులకు సేవలు అందించామని, కాశ్మీర్‌ వరదల్లో చిక్కుకున్న వారికీ సేవలు అందజేస్తామన్నారు. అనంతరం చినముషిడివాడ వెళ్లారు.