Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:48AM

విద్యుత్‌ సర్వీసులకు ఆధార్‌, సెల్‌ నెంబర్లు తప్పనిసరి: దొర

గుంటూరు, సెప్టెంబర్‌ 11 : విద్యుత్‌ వినియోగదారులు సర్వీస్‌ కనెక్షన్‌కు ఆధార్‌కార్డు నెంబర్‌, సెల్‌ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని సదరన్‌ డిస్కం సీఎండీ హెచ్‌వై దొర తెలిపారు. గంటూరులో గురువారం ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యుత్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధార్‌, సెల్‌ ఫోన్‌ నెంబర్ల అనుసంధానం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. అలాగే విద్యుత్‌ వాణిజ్య వినియోగదారులు కూడా కమర్షియల్‌ టాక్స్‌ నెంబర్‌ను అనుసంధానం చేయాలన్నారు. తద్వారా ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంటుందన్నారు.