Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:47AM

ప్రతీకార హత్య.. మరో ముగ్గురికి కత్తిపొట్లు

కారంపూడి, సెప్టెంబర్‌ 11: గుంటూరు జిల్లా కారంపూడి మండలం చినగార్లపాడులో ఫ్యాక్షన్‌ పురివిప్పి ప్రతీకార హత్యలకు దారితీసింది. ఈ ఏడాది జనవరి 24న టీడీపీ నేత బత్తుల గోపాల్‌ను వైసీపీ వర్గీయులు హత్య చేశారు. అనంతరం వారు బెయిల్‌పై వచ్చారు. కాగా మృతుడు గోపాల్‌ వర్గీయులు ప్రతీకారం తీర్చుకునేందుకు గురువారం గోపాల్‌ హత్యకేసులో నిందితుల్లో ఒకరైన వేంపాటి గోవిందరెడ్డి(45)పై కత్తులతో దాడిచేసి హత్య చేశారు. అడ్డుకోబోయిన అతడి భార్యను గాయపరిచారు. ఈ ఘర్షణలో పొలం నుంచి వస్తున్న చింతలచెరువు కోటిరెడ్డిపై కత్తులతో దాడిచేయగా, అతనిని గుంటూరు వైద్యశాలకు తరలించారు.గాయాలపాలైన శివారెడ్డి పరారయ్యాడు. ఈ దాడుల్లో 20 మందికిపైగా పాల్గొన్నారని విచారణలో వెల్లడైందని డీఎస్పీ పూజ తెలిపారు.