Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:36AM

సెల్‌కాన్‌ నుంచి అల్ర్టా క్యు500

 ధర రూ.9,999
 భారతి ఎయిర్‌టెల్‌, స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మొబైల్‌ ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న సెల్‌కాన్‌ మరో ప్రీమియం, హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ ‘అల్ర్టా క్యు500’ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ కోసం భారతి ఎయిర్‌టెల్‌, స్నాప్‌ డీల్‌ డాట్‌ కామ్‌తో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన వారు హం గామా యాప్‌ ద్వారా నెల రోజుల పాటు లక్ష రూపాయలకు మించిన విలువైన మ్యూజిక్‌, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌లో ఎన్నో రకాల ప్రీలోడెడ్‌ గేమ్స్‌ కూడా ఉన్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నందు వల్ల ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్‌ కస్టమర్లు నెలకు 1జిబి డేటాను రెండు నెలల పాటు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. 12,999 రూపాయల విలువైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్నాప్‌డీల్‌ డాట్‌కామ్‌లో 9,999 రూపాయలకే అందిస్తున్నట్టు సెల్‌కాన్‌ మొబైల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై గురు తెలిపారు.
అల్ర్టా క్యు500 ఫీచర్లు
జూ ఐదు అంగుళాల హెచ్‌డి స్ర్కీన్‌ జూ 2జిబి ర్యామ్‌ జూ 16 జిబి ఇంటర్నల్‌ మెమరీ జూ ఐపిఎస్‌ ఒజిఎస్‌ డిస్‌ప్లే జూ 1.2 గిగాహెట్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ జూ 4.4 ఆండ్రాయిడ్‌ కిట్‌క్యాట్‌ ఔస్‌ జూ 32 జిబి ఎక్స్‌పాండేబుల్‌ మెమరీ సదుపాయం జూ 8 ఎంబి వెనుక, 2 ఎంపి సెల్ఫీ కెమెరా జూ 3జి, వీడియో కాల్‌ సదుపాయం జూ జిపిఎస్‌, వైఫై, బ్లూటూత్‌ జూ 2,500 ఎంఎహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్‌ుఛీ’9?